కొరటాల డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ?

222

యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా వస్తుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.విజయ్ దేవరకొండ, మెహ్రీన్ జంటగా నటించిన చిత్రం ‘నోటా’.ఈ సినిమాకి జ్ఞానవేల్ రాజా నిర్మాత. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, సామ్ సి సుందర్ సంగీతం సమకూర్చారు.

Related image

 

ఈ సినిమా విడుదల దగ్గరవుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పనులను మరింత వేగవంతం చేసింది. పబ్లిక్ మీట్ పేరిట సభలు నిర్వహిస్తూ చిత్రానికి మరింత బూస్ట్ ఇస్తున్నారు. కాగా సోమవారం హైదరాబాద్‌లో భారీగా పబ్లిక్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

కొరటాల శివ మాట్లాడుతూ..‘‘ఇలాంటి డిఫెరెంట్ సినిమా తీసినందుకు నిర్మాత జ్ఞానవేల్ రాజా గారికి అభినందనలు. ఇక విజయ్ గురించి చెప్పాలంటే ‘పెళ్లి చూపులు’ చూసినప్పుడు ఒక స్క్రిప్ట్ రాయాలనుకున్నాను. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ఇప్పుడు ‘నోటా’ ఇవన్నీ చూస్తుంటే మంచి స్క్రిప్ట్‌తో విజయ్ దగ్గరికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. తప్పకుండా ఒక మంచి స్క్రిప్ట్‌తో వస్తాను. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.కొరటాల శివ మాటలు చూస్తుంటే త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందన్న మాట.