ఈజిప్టులో ఎంజాయ్ చేసిన కొణిదెల ఉపాసన నారా బ్రాహ్మణి

299

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు. ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అభిమానులతో టచ్ లో ఉంటేనే రాంచరణ్ విశేషాలన్నీ తెలియజేస్తున్నారు. ఇటీవల ఉపాసన ఈజిప్ట్ వెకేషన్ వెళ్లారు. ఈ వెకేషన్ కు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా వెళ్లడం విశేషం.

Related image

నారా బ్రాహ్మణి, ఉపాసన మంచి స్నేహితులు. మరి కొంతమంది స్నేహితులతో కలసి వీళ్లంతా ఈజిప్టు టూర్ వెళ్లారు. వీళ్ళు కలిసి ఈజిప్తులో సందడి చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈజిపప్టులో ఫేమస్ పిరమిడ్‌గా పేరొందిన గిజా పిరమిడ్ వద్ద తమ స్నేహితులతో కలిసి ఉపాసన, బ్రాహ్మణి సందడి చేశారు.

చుట్టుప్రక్కల ఉన్న పలు చారిత్రిక ప్రదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేశారు.గురు, శుక్ర, శనివారం ఈజిప్టులో తిరిగి చరిత్రకు సంబంధించిన విషయాలు నేర్చుకున్నాం, చర్చించుకున్నాం అని పేర్కొంటూ ఆ పిక్స్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది ఉపాసన.