జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ హీరో

384

వైయ‌స్సార్ బ‌యోపిక్ యాత్ర చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది..ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి రాఘవ. ఈ సినిమా పై ఎన్నో అంచ‌నాల‌తో సినిమా తెర‌కెక్కిస్తున్నారు.. ఇక తెలుగునాట ఎన్టీఆర్ బ‌యోపిక్ తో పాటు ఇటు యాత్ర కూడా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి.. ఇక ఈ సినిమాలో ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నారు అనే స‌స్పెన్స్ కు బ్రేక్ ప‌డింది… వైయ‌స్సార్ పాత్ర‌లో ఉన్న మ‌మ్ముట్టి టీజ‌ర్ తో ఆక‌ట్టుకున్నారు.. ఇక వైయ‌స్సార్ గా ఆయ‌న బాగా సెట్ అయ్యారు అని ప్ర‌శంస‌లు వ‌చ్చాయి..

Related image

తాజాగా ఈ సినిమాలో పాత్ర‌లు కొన్ని ఫైన‌ల్ అయ్యాయి అని తెలుస్తోంది… ఓసారి ఆ పాత్ర‌లు రోల్స్ ఏమిటో తెలుసుకుందాం….వైఎస్ తండ్రి పాత్రలో జగపతిబాబు, అలాగే వైయ‌స్ కు సోద‌రిలా ఉండే మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని.. ఇక వైఎస్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక, సూరీడు పాత్రలో పోసాని నటించనున్నట్లు తెలుస్తోంది.

Image result for hero karithiki

ఇక ముఖ్య‌మైన పాత్ర జ‌గ‌న్ ది, ఇక ఆయ‌నని రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చిన రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌చారం కూడా చేశారు.. ఈ సినిమాలో అది చూపించాలి కాబ‌ట్టి, జ‌గ‌న్ పాత్ర‌కోసం ఇప్ప‌టికే ఓ హీరోని ఫైన‌ల్ చేశారు అని తెలుస్తోంది.. ఆ హీరో ఎవ‌రో కాదు ఆయ‌న త‌మిళ హీరో కార్తి అని తెలుస్తోంది…ఇప్పుడు ఈ వార్త వైర‌ల్ అవుతోంది… మ‌రి చిత్ర యూనిట్ దీనిపై ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు… ఇప్ప‌టికే చిన‌బాబు సినిమాతో మంచి స‌క్సెస్ లో ఉన్నారు కార్తి.. మ‌రి సినిమాకి ఒప్ప‌కున్నారో లేదా తెలియాల్సి ఉంది.