Breaking News : నటి ఝాన్సీ ఆత్మహత్య ఘటన మరవకముందే మరొక నటి ఆత్మహత్య.. షాక్ లో ఇండస్ట్రీ..

287

సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం నెలకొంది. నిన్నకాక మొన్న సినీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే మరొక నటి ఆత్మహత్య చేసుకుంది. సినీ, టెలివిజన్ నటి యషిక ఆత్మహత్య చేసుకుంది.. తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచారు. నటి యాషిక అసలు పేరు మేరీ షీలా జెబరాని. గతంలో వడపళనిలోని ఓ హాస్టల్‌లో నివసించేంది. ఆ క్రమంలో పెరంబూరుకు చెందిన అరవింద్ అలియాస్ మోహన్‌బాబు అనే వ్యాపారవేత్తతో పరిచయం సహజీవనానికి దారి తీసింది. గత కొద్దికాలంగా వారిద్దరూ చెన్నైలోని పెరవల్లూర్‌లోని జీకేఎం కాలనీలో సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. యషిక, మోహన్‌బాబు సహజీవనంలో అవాంతరాలు ఏర్పడ్డాయి. అభిప్రాయ బేధాలు తలెత్తడంతో వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మూడు రోజుల క్రితం జరిగిన ఓ గొడవతో యషిక మనస్తాపం చెందినట్టు తెలిసింది. దాంతో తన ప్రియుడిని ఇంటి నుంచి బయటకు పంపినట్టు కథనాలు వెలువడుతున్నాయి.

ప్రియుడి నుంచి వేధింపుల ఎక్కువడంతో యషిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన మరణానికి కారణం ప్రియుడే అని తన తల్లికి వాట్సప్‌లో సందేశాన్ని పంపారు. పెళ్లి చేసుకోకుండా మోసగించడం వల్లే ఈ దారుణానికి ఒడిగడుతున్నానని సందేశంలో పేర్కొన్నారు. తన మరణానికి కారణమైన మోహన్‌బాబుకు కఠిన శిక్ష పడేలా చేయాలని తల్లిని కోరారు. యషిక ఆత్మహత్య వార్త బయటకు పొక్కడంతో హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టమ్‌కు పంపి విచారణ ప్రారంభిస్తున్నారు. పోస్టు మార్టమ్ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు అడుగులేస్తున్నట్టు తెలిసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తమిళనాడులోని తిరుప్పురుకు చెందని యషిక సినిమా రంగంలో రాణించాలని చెన్నైకి చేరుకొన్నారు. విమల్ హీరోగా నటించిన మన్నార్ వగైయారా చిత్రంలో నటించారు. ఆనంది లాంటి ఇతర సీరియల్స్‌లో నటించారు.అలాగే తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించింది. చెల్లెలి క్యారెక్టర్స్ కు ఈమె ఫెమస్. అయితే ఈమె ఎక్కువగా తమిళ్ సినిమాలలోనే నటించింది. యషిక మృతికి తమిళ సినీ వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి. పలువురు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.