‘కెజిఎఫ్’మూవీ రివ్యూ ప్రభాస్ కి ధీటుగా దుమ్ములేపిన యష్

410

కన్నడ రాకింగ్ స్టార్ యాష్ నటించిన భారీ ప్రాజెక్ట్ మూవీ ‘కేజీఎఫ్’(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైంది. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మాతగా రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కేజీఎఫ్’లో యాష్‌కి జోడీగా శ్రీనిధి శెట్టి నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేశారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏక కాలంలో భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా.

Image result for kgf movie

సినిమా కథ విషయానికి వస్తే 1970 ప్రాంతంలో కోలార్ బంగారు గనుల్లో పనిచేసిన కార్మికుల జీవితాల ఆధారంగా తీసిన యాక్షన్ చిత్రం. 1951 లో పుట్టిన ఒక వ్యక్తి గనుల సామ్రాజ్యాన్ని స్పృష్టించుకుంటాడు.అయితే వాళ్లకు అపోజిట్ గా ఉండే వ్యక్తులు ఆ నేర సామ్రాజ్య అధిపతిని చంపడం కోసం యష్ తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. మరి అతను ఎలా చంపాడు. అసలు చంపడా లేదా ఆ నేర సామ్రాజ్య అధిపతికి రాఖీ పాత్రలో జీవించిన యష్ కు సంబంధం ఏమిటి అనేదే చిత్ర కథ.రాఖీ పాత్రలో యష్ డైనమిక్ పాత్ర పోషించాడు. క్షణం కూడా తెరనుంచి చూపు మరల్చలేని విధంగా సినిమా ఉంటుంది.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఇక బ్యాగ్రౌండ్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంది. కన్నడ సినిమా స్థాయిని తెలియజేసే చిత్రం ఇది. అన్ని చిత్రాలు రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయం.. కేజీఎఫ్ చిత్రం చూశాక మాటలు రావంటే అతిశయోక్తి కాదు.. దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఫస్టాఫ్ అద్భుతంగా ఉంటుంది. సెకండాఫ్ ఊర మాస్ లా ఉంటుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్లస్ పాయింట్స్ : యష్ నటన, డైరెక్షన్ ,సినిమాటోగ్రఫీ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథ స్క్రీన్ ప్లే..

మైనస్ పాయింట్స్ : హీరోయిన్ కు అంతలా ప్రాధాన్యత ఇవ్వలేదు, రొమాన్స్ ఎక్కువగా లేదు..

ఈ సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 4/5