కేర‌ళ బాధితుల‌కు సుమ ఏమి సాయం చేసిందో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

472

భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో అక్కడ జనజీవనం చిన్నాభిన్నమైంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో వరద బీభత్సానికి బలయ్యారు. కేరళ జల విలయం కారణంగా దిక్కుతోచని పరిస్థితులో ఉన్న అక్కడి ప్రజలను ఆదుకునేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు, ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. తెలుగు నటుడు రాజీవ్ కనకాలను పెళ్లాడి హైదరాబాద్‌లో సెటిలైన కేరళవాసి, ప్రముఖ యాంకర్ సుమ తమ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని రిక్వెస్ట్ చేశారు.

తెలుగు సినీ ప్రముఖుల విరాళాలు

కేరళలో వరద బీభత్సం కారణంగా చాలా మందికి తినడానికి తిండి, నీరు, పవర్ సప్లై లేదు. చాలా మంది అల్లాడి పోతున్నారు. ఈ సమయంలో మానవతా ధృక్పథంతో కేరళ చీఫ్ మినిస్టర్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కోసం అందరూ తోచిన సహాయం అందించాలని సుమ కోరారు.మా వూరు పాలక్కడ్. వరదల కారణంగా ఈ ప్రాంతం కూడా నీట మునిగి ఉంది. అందరికీ మీరు సహాయ సహకారాలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను…. అని సుమ రిక్వెస్ట్ చేశారు.నా వంతు సాయం నేను చేస్తున్నాను. మీలో చాలా మంది చేశారని, ఇంకా చేస్తారని ఆశిస్తున్నాను.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

చాలా ఎన్జీవోలు యుటిలిటీ సామాన్లు సప్లై చేస్తున్నాయి. మనం కూడా అందులో భాగం కావొచ్చు అని సుమ తెలిపారు.కేరళ వరద బాధితుల కోసం తెలుగు సినీ ప్రముఖులు విరాళాలు అందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున రూ. 10 లక్షలు, చిరంజీవి రూ. 25 లక్షలు, నాగార్జున రూ. 28 లక్షలు, మహేష్ బాబు రూ. 25 లక్షలు, ఎన్టీఆర్ రూ. 25 లక్షలు, అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, రామ్ చరణ్ రూ. 25 లక్షలు, మహేష్ బాబు రూ. 25 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 10 లక్షలు, విజయ్ దేవరకొండ రూ. 5 లక్షలు, రామ్ పోతినేని రూ. 5 లక్షలు, కొరటాల శివ రూ. 3 లక్షలు విరాళం అందించారు.