కీర్తి సురేష్ బంపర్ ఆఫర్…#RRR లో ఛాన్స్..ఏ హీరోకు జోడిగానో చూడండి

273

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ ఆదివారం ఉదయం 11.11 గంటలకు లాంచనంగా ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, వివి వినాయక్‌, కొరటాల శివ, ప్రభాస్, రానాతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Image result for #rrr

బాహుబలి తర్వాత ఆ స్థాయికి తగిన విధంగా సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలయికతో రేర్ కాంబినేషన్ సెట్ చేశారు. మెగా, నందమూరి అభిమానుల సపోర్టుతో ఈ సినిమా ఏ స్థాయికి వెళుతుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు.ఇంతవరకు అపజయం అంటూ ఎరుగని దర్శకుడు ఒక వైపు అలాగే కలక్షన్స్ తో రికార్డులను సృష్టించే ఇద్దరు స్టార్ హీరోలు మరో వైపు . వీరి ముగ్గురి కలయికలో సినిమా వస్తుదంటే అంచనాలు ఏ స్థాయిలో వుంటాయో చెప్పనక్కర్లేదు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కాబోతుంది.

Image result for keerthi suresh and ram charan

రాజమౌళి దర్సకత్వంలో రాబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోలకు జోడిలను వెతికే పనిలో ఉన్నాడు జక్కన.ముగ్గురు ముద్దుగుమ్మలను ఈ చిత్రంలో నటింపజేస్తాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఆ విషయాన్ని నిర్థారించారు.ఒక హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ కీర్తి సురేష్ ఎంపికైనట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రాజమౌళి రాంచరణ్ కు జోడిగా కీర్తి సురేష్ ని ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.