నాలో ఈ యాంగిల్ కూడా ఉందని అస్సలు అనుకోలేదు కదా : కీర్తి సురేష్

246

ఇప్పుడు కీర్తి సురేష్ పేరు వినగానే మహానటి గుర్తుకు వస్తుంది.సావిత్రి పాత్రలో ఆమె నటించింది అనడం కన్నా జీవించింది అనే చెప్పుకోవాలి.సావిత్రి పోలికలు ఉండడం కీర్తి సురేష్ కు బాగా కలిసొచ్చింది.‘ నేను శైలజ’, ‘నేను లోకల్‌’ చిత్రాల్లో చాలా పద్ధతిగా కనిపించింది కీర్తి సురేష్‌ ‘మహానటి’తో ఒక్కసారిగా విశ్వరూపం చూపించేసింది.

Image result for keerthi suresh

అయితే ప్రస్తుతం ఆమె నటించిన చిత్రం సామి విడుదల అయ్యింది. ‘స్వామి’లో కాస్త మాస్‌ టచ్‌ ఉన్న పాత్ర చేసింది. ఇప్పుడు ‘పందెం కోడి 2’లోనూ ‘అంతకు మించి’ కనిపించబోతోంది. మీలో ఈ కొత్త కోణమేంటి? అని అడిగితే ‘‘నటిగా అన్ని పాత్రలూ చేయాలి కదా? నాలో మాస్‌ కోణం కూడా ఉంది. అది ఈ చిత్రాలు చూపించబోతున్నాయి. ఇలా వైవిధ్యభరితమైన చిత్రాలొచ్చినప్పుడే కదా, కొత్తగా కనిపించే అవకాశం వస్తుంది.

Related image

నేను కూడా ‘ఫలానా పాత్రలకే’ అనే పరిమితులేం పెట్టుకోలేదు. అల్లరి పిల్లగానూ నటించాలి. ఆ అవకాశం ఇప్పుడొస్తున్న కథలు ఇస్తున్నాయి. అయితే ఏ పాత్ర చేసినా ఇది వరకు సంపాదించుకున్న గుర్తింపు మాత్రం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడతా’’ అంటోంది కీర్తి సురేష్.