మహానటి తర్వాత మరో తెలుగు సినిమా స్టార్ట్ చేసిన కీర్తి సురేష్..

216

మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ప్రేమను గెలుచుకుంది కీర్తిసురేష్. మహానటి తర్వాత పూర్తీగా తమిళ్ ఇండస్ట్రీ మీదనే కాన్సంట్రేట్ చేసింది. ఇంతవరకు ఒక్క తెలుగు సినిమా కూడా ఒప్పుకోలేదు.

Related image

అయితే తాజాగా కొత్త దర్శకుడు నరేంద్ర దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెల మూడో వారం నుంచి స్టార్ట్‌ కానుందని సమాచారం. ఇందులో కీర్తీ సురేశ్‌ లీడ్‌ రోల్‌లో కనిపిస్తారు. ఆమెతో పాటు మరో మూడు ముఖ్యమైన పాత్రలు ఉంటాయట.

Related image

‘మహా నటి’కి కెమెరామేన్‌గా వర్క్‌ చేసిన డ్యానీ ఈ సినిమాకి కెమెరామేన్‌గా వ్యవహరించనున్నారు. ఎక్కువభాగం అమెరికాలో షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని మహేశ్‌ యస్‌.కోనేరు నిర్మిస్తున్నారు. కల్యాణీ మాలిక్‌ సంగీతం అందిస్తున్నారు.