మరో లేడి ఓరియెంటెడ్ స్టార్ట్ చేసిన మహానటి కీర్తి సురేష్

241

‘మహానటి’తో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు కీర్తి సురేష్‌. ఈ మూవీ తరువాత ఇప్పటివరకు మరే తెలుగు ప్రాజెక్ట్‌ను కీర్తి సురేష్‌ ప్రకంటించలేదు. తమిళ్‌ డబ్బింగ్‌ సినిమాలైన సామి, పందెంకోడి2, సర్కార్‌ సినిమాలతోనే టాలీవుడ్‌ను పలకరించింది. తాజాగా కీర్తి సురేష్ మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సినిమా కూడా నేడు లాంఛనంగా ప్రారంభం అయింది.

after mahanati; actress keerthy sureshs new lady oriented telugu film launched

ఈస్ట్ కోస్ట్ బ్యానర్ లో మహేష్ కోనేరు నిర్మాతగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంతో కీర్తి సురేష్ మరో అద్భుతమైన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమా ద్వారా న‌రేంద్ర‌ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

Keerti Suresh

సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఈ సినిమా ఈరోజు అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. దీనికి క‌ళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్, వెంకీ అట్లూరి, భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ త‌దిత‌రులు ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి హాజ‌రై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌చేసారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.