100 రోజుల గ్రాండ్ సక్సెస్ “మహానటి”..!

342

అలనాటి మేటి నటి మహానటి సావిత్రి జీవిత కధ ఆదారంగా రూపుదిద్దుకున్న సినిమా మహానటి మే 9 న భారీ అంచనాల మధ్య విడుదలయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..అలాంటి మహానటి జీవిత కథను ప్రేక్షకులకు తెలియజేయాలని , తెలిసిన వారికీ మరోసారి గుర్తు చేయాలనే ప్రయత్నం తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’.తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పుస్తకాన్ని రాసుకున్న నటి సావిత్రి. 75 శాతం నటిగానే ఆమె జీవితం సాగింది. మిగిలిన 25 శాతం పెళ్లి తర్వాత జరిగిన పరిణామాలతో ముగిసింది…

సావిత్రి గా కీర్తి సురేష్ నటన అద్వితీయం..అధ్బుతం..ఈ సినిమా విజయంలో ఆమె నటన కీలకం అని చెప్పక తప్పదు..సావిత్రి పాత్రకు తాను తప్ప వేరొక ఆప్షన్ లేదని పక్కాగా నిరూపించింది. అప్పటివరకూ పరాజయాల్లో ఉన్న అశ్వనిదత్ కాంపౌండ్ లో నూతనోత్సాహం నింపింది మహానటి. ఈ చిత్రం ఫుల్ రన్ లో దాదాపు 80 కోట్లు వసూలు చేసిందన్న సమాచారం ఉంది. కేవలం తెలుగులోనే కాదు అటు తమిళనాడులోనూ బంపర్ హిట్ కొట్టింది. ఇంతటి ఘనవిజయానికి చిహ్నంగా తాజాగా 100రోజుల పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. `మహానటి 100 గ్రాండ్ డేస్` అంటూ చిత్రయూనిట్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అందించిన విజయమిది అంటూ మహానటి టీమ్ ఆనందం వ్యక్తం చేసింది.