అమెరికాలో విజ‌య్ తో కీర్తీసురేష్ స్టెప్పులు

393

త‌మిళ యువ స్టార్ హీరో విజ‌య్ క్రియేటివ్ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు.. ఈ సినిమా పేరు స‌ర్కార్.. ఈ చిత్రం ఫుట్ బ్యాక్ గ్రౌండ్ పొలిటిక‌ల్ ధీమ్ తో తెర‌కెక్కుతోంది.. ఇక ఈ సినిమార‌కి సంబంధించి చాల వ‌రకూ షూటింగ్ పూర్తి అయింది.. ఇక ఈ సినిమాకు కేవ‌లం ఒక్క సాంగ్ షూటింగ్ మాత్ర‌మే మిగిలి ఉంద‌ట దీంతో ఆ పాట కోసం అమెరికాకు వెళ్లిందిచిత్ర యూనిట్.. లాస్ ఏంజెల్స్ లో ఈ పాట‌ను తెర‌కెక్కింనున్నారు.

Image result for tamil vijay with murugadoss

ఇక ఈ పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ సినిమా రైతుల క‌న్నీటి గాధ‌ల‌ను కూడా చూపించ‌నున్నార‌ట‌.. ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు..ఇక చిత్ర యూనిట్ అంతా షూటింగ్ పూర్తి చేసుకొవ‌డంతో వీరు ఇద్ద‌రూ ఈసాంగ్ లో న‌టిస్తున్నార‌ట‌..ఇక వీరిద్ద‌రూ డ్యాన్స్ చేసి ఈ పాట షూటింగ్ పూర్తి అయిన త‌ర్వాత ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌నున్నారు.

Image result for vijay and keerthi

ఇక కోలీవుడ్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మీ కూడా ఈ చిత్రంలో ఓ కీల‌క రోల్ లో న‌టించారు అని తెలుస్తోంది.. ఈ సినిమాను దీపావ‌ళికి రిలీజ్ చేయ‌నున్నారు.. ఈ సినిమా తరువాత విజయ్ తనకు తేరి, మెర్సల్ ‘లాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించనున్నాడు.