హరికృష్ణ చనిపోయిన 2 రోజులకు మరో షాకింగ్ నిజం బయటపెట్టిన కీరవాణి

427

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం మన అందరికి తెలిసిందే.గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. పలువురు సినీ ప్రముఖులు రాజకీయనాయకులు,కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు జరిగాయి.అయితే హరికృష్ణ వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికి తెలిసేవిధంగా mm కీరవాణి ఒక ట్వీట్ చేశాడు.కీరవాణి చెప్పిన విషయం వింటే హరికృష్ణ ఇంత గొప్పవాడా అని అనకుండా ఉండలేరు.మరి కీరవాణి చేసిన ఆ ట్వీట్ లోని విషయాల గురించి తెలుసుకుందామా.

Image result for harikrishna

తెలుగు జాతి గర్వించే మహోన్నత వ్యక్తికి హరికృష్ణ కుమారుడు. స్వతహాగా నటుడు. రాజకీయ నాయకుడు. నేడు ఓ స్టార్ హీరోకి తండ్రి. అయినా ఎక్కడా గర్వం కనిపించదు. ఎప్పుడూ నిరాడంబరమైన జీవితాన్నే గడిపారు.ఎప్పుడు సింపుల్ గా ఉండేందుకే ఇష్టపడేవాడు.ఇప్పుడే కాదు ఆయన తండ్రి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎలాంటి గర్వం చూపించేవాడు కాదంట.‘నేను ముఖ్యమంత్రి కుమారుడిని, నా హోదా ఏమిటో తెలుసుకోవాలి’ లాంటి పదజాలం ఆయన ఎప్పుడూ వాడలేదు. దీనికి ఉదాహరణగా చూపుతూ కీరవాణి ఒక పేపర్ కట్టింగ్‌ను ట్వీట్ చేశారు.

Image result for harikrishna

భేషజాల్లేని మనిషి..’ అనే శీర్షికతో ఉన్న ఆ కట్టింగ్‌లో ‘ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక రోజు హైదరాబాద్‌లో హరికృష్ణ కారులో వెళుతున్నారు. ముషీరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నల్ దాటారన్న కారణంతో ఓ పోలీసు ఆయనను ఆపి చలానా రాశారు. హరికృష్ణ తాను ఎవరో చెప్పకుండా.. చలానా కట్టేసి ముందుకు వెళ్లారు’ అని రాసి ఉంది. కీరవాణి ఈ క్లిప్పింగ్‌ను ఎక్కడ సేకరించాలరో తెలీదు కానీ.. హరికృష్ణ ఔన్నత్యాన్నీ చాటడానికి ఇదీ ఒక ఉదాహరణగా మిగిలింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అతను అనుకుంటే నేను ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పి ఆ పోలీసుల దగ్గర ప్రవర్తించవచ్చు.కానీ అలా చెయ్యలేదు.తప్పు చేశాడు కాబట్టి ఫైన్ కట్టేసి వెళ్లిపోయాడని కీరవాణి ట్వీట్ చేసిన శీర్షికను చూస్తే మనకు ఇట్టే అర్థం అవుతుంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హరికృష్ణ మరణం గురించి అలాగే ఆయన మంచితనం గురించి అలాగే కీరవాణి చేసిన ఈ ట్వీట్ లో ఉన్న విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.