ఆరోజు పవన్ కళ్యాణ్ గారు భుజం మీద చేయి వేసి చెప్పారు.. అందరికీ స్పాట్ పెట్టా

325

113 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. అందరూ ఊహించని విధంగానే కౌశల్ విజేతగా నిలిచాడు. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్ ని కౌశల్ అందుకున్నాడు. ఈ సీజన్ లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా అదరగొట్టాడు. గీత మాధురి రన్నరప్ గా నిలిచింది.కౌశల్ ఆర్మీ నుంచి కౌశల్ కు పెద్ద ఎత్తున స్పందన లభించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ విజేతగా నిలిచిన తరువాత కౌశల్ ఆర్మీ నిర్వహించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ లో కౌశల్ దంపతులు పాల్గొన్నారు. ఈ సెలెబ్రేషన్స్ లో కౌశల్ పలు ఆసక్తికర విశేషాలు బిగ్ బాస్ గురించి తెలియజేశాడు.
బిగ్ బాస్ హౌస్ లోకి నా ఎంట్రీ అంతా ఈజీగా జరగలేదని కౌశల్ తెలిపాడు.

 వారం పట్టింది

కాస్తో కూస్తో తెలిసిన సెలబ్రిటీనే అయినప్పటికీ చాలా పెద్ద తతంగం జరిగిందని వివరించాడు. నన్ను ఎంపిక చేయడానికి 6 ఇంటర్వ్యూలు చేశారు. నా మల్టీ టాస్కింగ్ టాలెంట్ చూసి చివరకు ఎంపిక చేశారని కౌశల్ అభిప్రాయపడ్డారు.హౌస్ మేట్స్ ని అర్థం చేసుకోవడానికి, వాళ్ళ మైండ్ సెట్ తెలుసులోవడానికి నాకు వారం పట్టింది. రెండవ వారం నుంచి అసలైన గేమ్ మొదలు పెట్టానని కౌశల్ తెలిపాడు. బిగ్ బాస్ లో జరిగిన సంగతులన్నీ గుర్తు చేసుకున్నాడు.తొలివారంలో డైనింగ్ టేబుల్ వద్ద తేజస్వీతో జరిగిన గొడవ గురించి కౌశల్ ప్రస్తావించాడు. హౌస్ లో అంతమంది ఉండగా సోఫాలో కూర్చుని తినడం ఏంటని ప్రశ్నించాను. ఆ గొడవలో తేజస్వి చాలా మాటలు అన్నారు. ఆ గొడవతో తప్పు చేస్తే ప్రశ్నించాలి అనే నా జర్నీ ప్రారంభమైంది అని కౌశల్ తెలిపాడు.బాబు గోగినేని గురించి కూడా కౌశల్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

బాబుగారు ఆ మాట అన్నారు

తాను అక్కడ ఎవరిని ప్లాన్ చేసి నామినేషన్స్ లో పెడితే మీరు ఇక్కడ వాళ్ళని సాగనంపారని కౌశల్ తెలిపాడు. నేను లేనప్పుడు బాబు గోగినేని గారు ఒక మాట అన్నారు. మిగిలిన హౌస్ మేట్స్ తో ఆయన మాట్లాడుతూ మనం కౌశల్ ని బయటకు పంపడానికి పనిచేయాలి అని అన్నారు.ఆయన ఎంత వర్క్ చేసారో తెలిపాడు కానీ.. బాబుగారిని బయటకు పంపడానికి తాను చాలా తక్కువ వర్క్ చేశానని కౌశల్ అభిప్రాయపడ్డాడు. తాను అందరికి హౌస్ లో ఒంటరిగా ఉన్నట్లు కనిపించా. కానీ గార్డెన్ లో, వరండాలో నడుస్తూనే అందరికి స్పాట్ పెట్టానని కౌశల్ అభిమానుల ముందు ప్రస్తావించాడు.హైదరాబాద్ లో తాను తొలిసారి మోడలింగ్ అకాడమీ ప్రారంభించానని, తన మోడలింగ్ అకాడమిని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రారంభించాడని కౌశల్ తెలిపాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆ సమయంలోనే పరిచయం ఏర్పడిందని కౌశల్ తెలిపాడు. తమ్ముడు చిత్రానికి కౌశల్ మోడలింగ్ కో ఆర్డినేటర్ గా పనిచేశాడు.పవన్ కళ్యాణ్ గారు నా భుజం మీద చేయి వేసి ఓ విషయం చెప్పారు. రాత్రంతా మోడల్స్ ని కోఆర్డినేట్ చేస్తూ మళ్ళీ ఉదయం షూటింగ్ కు హాజరు కావడం ఆయన గమనించారు.పవన్ కళ్యాణ్ గారు నా తో చెబుతూ.. నీ హార్డ్ వర్క్ చూస్తుంటే ముచ్చటేస్తోంది కౌశల్. మనం ఎంతలా కష్టపడుతున్నామో ఆ కష్టాన్ని పది కాలాలపాటు నిలబెట్టుకోవడం కూడా అంటే కష్టం అని అన్నారు. బిగ్ బాస్ హౌస్ లో తాను పడ్డ ఈ కష్టం విలువ భవిష్యత్తులో కొన్ని రోజుల తరువాత తెలుస్తుందని అని కౌశల్ అభిప్రాయపడ్డాడు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచి కౌశల్ పెద్ద సెలేబ్రిటిగా మారిపోయాడు.