బిగ్ హౌస్ లో గందరగోళం: బూతులు తిట్టుకున్న కౌశల్,గీతామాధురి షాక్ లో ఇంటి సభ్యులు

395

బిగ్ బాస్ హౌస్ ఫైన‌ల్ స్టేజ్ ఎంట్రీకి ఈవారం స‌మ‌యం ఉంది. ఇక మిగిలిన 30 రోజుల గేమ్ షో ధ‌ర్డ్ ఫేజ్ అని చెప్పాలి.. ఇక థ‌ర్డ్ ఫేజ్ లో కంటెస్టెంట్స్ మ‌ధ్య మ‌రింత వార్ జ‌రుగుతుంది అనేది, తాజాగా జ‌రుగుతున్న వివాదాల‌తో తెలుస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ముందు నుంచి కౌశ‌ల్ డిఫ‌రెంట్ గా ఉన్నాడు.. తాను ఇలాగే ఉంటా? బ‌య‌ట ఒక‌లా ఉండ‌టం ఇక్క‌డ ఒక‌ళా ఉండ‌టం చేత‌కాదు అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అలాగే ఫుల్ గా గేమ్ పై కాన్స‌న్ట్రేష‌న్ చేయ‌డం టాస్క్ ల్లో బాగా పార్టిసిపేట్ చేయ‌డంతో, కౌశ‌ల్ కు బీభ‌త్స‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఏకంగా కౌశ‌ల్ ఆర్మీ కూడా మ‌న దేశ ఆర్మీ అంత త‌యారు అయింది.

Image result for big boss telugu koushal and gheetha

 

ఇక 70 రోజులు దాటినా ఇక్క‌డ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ సెల్ఫ్ గేమ్ ఆడ‌టం లేద‌ని, గ్రూపు గేమ్ ఆడుతున్నారు అని నాని చెబుతూనే ఉన్నాడు. అయినా వీరిలో ఎటువంటి మార్పు రావ‌డం లేదు. ఇక ముఖ్యంగా ఇప్పుడు హౌస్ లో ట‌ఫ్ కంస్టెంట్ ఎవ‌రు అంటే ముందు కౌశ‌ల్ త‌ర్వాత త‌నీష్ ఆ త‌ర్వాత వినిపించే పేరు గీతామాధురి …వీరి ముగ్గురి పేర్లు బ‌య‌ట‌కు బాగా వినిపిస్తాయి. అయితే వీరు ముగ్గురికి స‌పోర్ట్ కూడా ప్రేక్ష‌కుల నుంచి ఎక్కువ‌గా ఉంది.. మ‌రీ ముఖ్యంగా చెప్పాలి అంటే కౌశ‌ల్ ప్రతీ వారం ఎలిమినేష‌న్ లో ఉన్నా కౌశ‌ల్ ని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి సేఫ్ చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇది కౌశ‌ల్ కు మ‌రింత స‌పోర్ట్ గా పెరిగింది అని చెప్పాలి.. దీంతో కౌశ‌ల్ కూడా త‌న‌కు వ‌స్తున్న మ‌ద్ద‌తుని చూసి త‌న ఆట‌లో మ‌రింత క‌సిని పెంచాడు.. ఇక కౌశ‌ల్ కు గీతామాధురికి ముందు నుంచి కాస్త వివాదాలు ఉన్నాయి.. మూడ‌వ వారం నుంచి గీతా కౌశ‌ల్ బాగా మాట్లాడుకోవ‌డం హౌస్ లో స్టార్ట్ చేశారు.. అప్ప‌టి నుంచి త‌మ‌ని ఇన్ ఫ్లూయెన్స్ చేస్తున్నారు అని గీతా కౌశ‌ల్ పై ఆరోప‌ణ‌లు చేసింది.. ఇక చివ‌రకు ఇప్పుడు కౌశల్ ని నేరుగా టార్గెట్ చేస్తోంది గీతా మాధురి.తాజాగా నేటిషోలో వీరి మ‌ధ్య సీరియ‌స్ వార్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది…. కౌశ‌ల్ – గీతా మ‌ధ్య పెద్ద వార్ జ‌రిగింది అనేలా ఉంది… మీరు ఆడ‌వ‌ల‌సిని గేమ్ నేను చెప్ప‌ను అని కౌశ‌ల్ అంటుంటే నా గేమ్ టాస్క్ లు కూడా మీరే చెబుతున్నారు, అలాగే న‌న్ను ఆడ‌ద్దు అని అన‌డానికి మీరు ఎవ‌రు అని కౌశ‌ల్ ని గీతా ప్ర‌శ్నించింది.

Image result for big boss telugu koushal

దీనికి కౌశ‌ల్ కూడా సీరియ‌స్ గా రియాక్ట్ అయ్యాడు.. మీ గేమ్ లో నేను ఎందుకు వ‌స్తాను అని అన్నాడు.. దీంతో గీతా కూడా కోపంగా కౌశ‌ల్ మీరు సేవ్ అవ్వ‌డానికి సేఫ్ గేమ్ ఆడుతూ సింప‌తి పొందుతున్నారు న‌న్ను తోసేస్తున్నారు అని కౌశ‌ల్ ని విమ‌ర్శించింది. దీంతో కౌశ‌ల్ కూడా గ‌తంలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తు చేయ‌డంతో, గీతా త‌నీష్ దీప్తి షాక్ అయ్యారు.. ఆపిల్ టాస్క్ లో మీరు ప‌క్కన ఉన్నారు. ఆమె బూత‌లు అన్న‌ప్పుడు మీరు ఏమీ అన‌లేదు అని కౌశ‌ల్ గీతాని ప్ర‌శ్నించారు… దీంతో గీతా కూడా ఇది క‌రెక్ట్ కాదు అని చెప్పింది. అలాగే దీప్తి కూడా కౌశ‌ల్ చేసిన కామెంట్లు స‌రైన‌వి కావు అని అన్నారు.. ఇక అప్ప‌టి వ‌ర‌కూ కూర్చుని ఆసాంతం వింటూ ఉన్న త‌నీష్ కౌశ‌ల్ పై విరుచుకుప‌డ్డాడు… మీరు తీసుకునే స్టాండ్ స‌రైన‌ది కాదు అని త‌నీష్ అన్నాడు..మొత్తానికి నేటి షో ఎటువంటి మ‌సాలా అందిస్తుందా అని ప్రేక్ష‌కులు అయితే వెయిట్ చేస్తున్నారు.