కౌశల్ బాగోతం బ‌య‌ట‌పెట్టిన కౌశ‌ల్ ఆర్మీ ఎంత డ‌బ్బులు కౌశ‌ల్ డిమాండ్ చేశాడో తెలిస్తే షాక్

431

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 2 పూర్తి అయి నెల‌లు గ‌డుస్తున్నా ఇంకా కౌశల్ గురించి, అక్క‌డ జ‌రిగిన గొడ‌వ‌ల గురించి అక్క‌డ‌క్కడా చర్చ‌లు జ‌రుగుతున్నాయి…బిగ్‌బాస్ హౌస్ లో ఉన్న కౌశల్.. బయట ఉన్న కౌశల్ చాలా డిఫరెంట్. కౌశల్ అంటే మనీ, మనీ అంటే కౌశల్ లాగా బిహేవ్ చేస్తున్నాడంటూ ఆయన అభిమానులు తిరుగుబాటు చేశారు. కౌశల్ ఆర్మీ ఫౌండర్ ఇమ్మాన్, కౌశల్ మీద అభిమానంతో డబ్బు ఖర్చు పెట్టిన బాధితులు మీడియా ముందుకు వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు. కౌశల్ అభిమానుల దగ్గర వెళ్లినా కూడా తనకు మనీ పరంగా ఏం లాభం జరుగుతుందని చూస్తారు. ఫ్యాన్స్ వద్ద డబ్బుంటేనే వారితో పాటు ఉంటాడు. డబ్బులేని ఫ్యాన్స్ వద్ద ఉండరు. ఆయన ఎక్కడికి వచ్చినా ఫ్యాన్స్ తో డబ్బు ఖర్చు పెట్టిస్తారు. అతడు ఎక్కడికి వెళ్లినా ఫ్లైట్స్ టికెట్స్, హోటల్ కూడా ఫ్యాన్సే బుక్ చేయాలి… ఈ విష‌యాలు ఇమ్మాన్ ఓ తెలుగు టీవీ ఛానల్‌కు వెల్లడించారు.

Image result for actor kaushal
కొంత మంది ఫ్యాన్స్ తమ వద్ద డబ్బులు లేక క్రిడిట్ కార్డులు వాడేసి, వారి ఇంట్లో ఉన్న గోల్డ్ తాకట్టు పెట్టి ఆయన కోసం ఖర్చు పెట్టారు. అలాంటి వారు చాలా మంది కౌశల్ నిజ స్వరూపం తెలిసి బాధ పడుతున్నారు. కౌశల్ అనే వ్యక్తి సొసైటీకి చాలా డేంజర్. బిగ్ బాస్ లో ఎలాగైతే సింపతీ గేమ్ డిజైన్ చేశాడో ఇపుడు అలాగే సింపతీ గేమ్ క్రియేట్ చేసి ఎవరైతే అతడికి వ్యతిరేకంగా ఉన్నారో వారిని టార్గెట్ చేసేలా చేస్తారని ఇమ్మాన్ ఆరోపించారు.తనకు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే అభిమానులను రెచ్చగొడతాడు. వారు రెచ్చిపోయి ట్రోల్స్ చేసేలా చేస్తాడు. ‘‘ఈ మధ్య మన ఆర్మీ మీద కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నా ఆర్మీ నుంచి స్పందన ఉండటం లేదు. మీరు డల్ అవ్వొద్దు. మీరు ఎంత యాక్టివ్‌గా ఉంటే నేను అంత యాక్టివ్‌గా ముందుకు వెళతా. లెట్స్ ఫైర్” అంటూ సందేశాలు పంపి తనకు వ్యతిరేకంగా ఉన్నవారిపై ఫ్యాన్స్ ట్రోల్ చేసేలా చేస్తాడట. ఇందుకు సంబంధించి వాయిస్ మెసేజ్ కూడా ఇమ్మాన్ వినిపించారు.

Image result for actor kaushalఅనామిక అనే మరో లేడీ ఫ్యాన్ కూడా మీడియా ముందుకు వచ్చి… కౌశల్ ఆర్మీ గ్రూపులో మనం ఏదైనా విషయమై ప్రశ్నిస్తే మనల్ని టార్గెట్ చేసేలా చేస్తారు. మనపై మూకుమ్మడి దాడి చేస్తారు. మనల్ని గ్రూపు నుంచి తీసేస్తారు. మనం డబ్బు ఇవ్వాలి… కానీ మనకు అడిగే ఆ డబ్బు సరిగి యుటిలైజ్ అవుతుందా? అని అడిగే హక్కు ఉండదు. నేను కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ కోసం 10 వేలు ఇచ్చాను. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నన్ను అబ్యూస్ చేశారు. బెంగుళూరు నుంచి అను అనే ఆవిడ ఫోన్ చేసి నీకేం కావాలి? నువ్వు అమ్మాయివి…ఎందుకు వారినోట్లో పడతావు. నీ పది వేలు నీకు ఇచ్చేస్తాం.. మూసుకుని కూర్చుంటావా? అని అనడంతో చాలా బాధేసిందని చెప్పుకొచ్చారు.

Image result for actor kaushal

కౌశల్ బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడు ఆయన భార్య నీలిమ రెచ్చగొట్టింది. వాళ్లు ఫెయిర్ గేమ్ ఆడలేదు. అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఎవరైనా అభిమానులు ప్రశ్నిస్తే… వారిని కూడా ట్రోల్ చేస్తారు. మీ నోరు నొక్కేస్తారు. మాట్లాడనీయరు. గ్రూపుల్లో నుంచి తీస్తారు. మీ పనులు మిమ్మల్ని చేసుకోమంటారు. వాళ్ల అరాచకం వారు చేస్తూనే ఉంటారని అనామిక తెలిపారు.కౌశల్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాయలసీమ అధ్యక్షుడు హరి కుమార్ మాట్లాడుతూ… నాకు కౌశల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటి నుంచే ఇష్టం. వైజాగ్‌లో జరిగిన సక్సెస్ మీట్ కోసం రూ. 10 వేలు, అనంతపూర్ లో జరిగిన సక్సెస్ మీట్ కోసం 28 వేలు పంపాను. కర్నూలులో జరిగిన సక్సెస్ మీట్ కోసం 80శాతం నేను ఖర్చు పెట్టాను. దాదాపు 500 మందికి అన్నదానం చేశాను. వాటర్ ప్యూరిఫైయర్లు పంపించాను. అనాధ ఆశ్రమాలకు ఎక్కడికి అడిగితే అక్కడికి డబ్బు పంపాను. ఇన్ని చేసిన నాకు… కౌశల్ ఒక చిన్న మెసేజ్ పెట్టగానే అందరూ నాపై రివర్స్ అయిపోయి తిట్టారు.

ఈ క్రింది వీడియో చూడండి 

కౌశల్‌తో సినిమా చేద్దామనుకున్నాను. చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. వాళ్ల ఆఫీసులోనే పూజ మొదలు పెట్టాం. కౌశల్ నెక్ట్స్ డే ఫోన్ చేసి 25 వేలు రెంటు అడిగారు. మీకు రెంటు ఇచ్చేట్లు అయితే ఫిల్మ్ నగర్ దగ్గర ఉండే చోటే వేరే ఆఫీసుకు తీసుకుంటాను అన్నాను. వాళ్ల వైఫ్‌ను లైన్ ప్రొడ్యూసర్ పెట్టి రూ. 50 వేలు సాలరీ ఇవ్వమన్నారు. వాళ్ల బాయ్ సాయికి రోజుకు 2 వేలు ఇవ్వాలన్నారు. ఇష్టమొచ్చిన గొంతెమ్మ కోరికలు కోరడంతో నాతో కాదు తీయలేను అన్నాను. అప్పటి నుంచి నాకు వేధింపులు మొదలయ్యాయని హరి కుమార్ తెలిపారు.బిగ్‌బాస్ హౌస్‌లో గెలిచిన 50 లక్షలు చారిటీకి ఇస్తామన్నారు. మేము కష్టపడటం వల్ల కౌశల్ గెలిచారు… మా వల్ల సొసైటీకి మంచి జరుగుతుందని కౌశల్ ఆర్మీ ఫ్యాన్స్ అంతా చాలా హ్యపీగా ఫీలయ్యాం. అదే విధంగా కౌశల్ స్థాపించిన ఫౌండేషన్ కోసం డబ్బు పంపాం. వాటిని సేవా కార్యక్రమాల కోసం కాకుండా దుర్వినయోగం చేస్తున్నారని కౌశల్ మీద తిరుగుబాటు చేసిన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మ‌రి దీనిపై కౌశల్ ఎలాంటి స‌మాధానం ఇస్తారో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.