కౌశల్ ఆర్మి దెబ్బకు ఈ వారం ఈ ఇద్దరు ఔట్

471

టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 2 లో రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోతుంది. కొంత మంది గ్రూపులు, ప్రేమాయణాలు, కక్ష్యలు, తిట్టుకోవడాలు ఇలా బిగ్ బాస్ హౌజ్ లో ప్రతిరోజు ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఇక టాస్క్ ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..ఈ టాస్క్ లో గెలుపు కోసం ఒకరిపై ఒకరు పోటీగా నిలుస్తున్నారు.అయితే ఇంటి సభ్యులలో కొందరి మద్య తీవ్రంగా గొడవలు కూడా వుతున్నాయి.ముఖ్యంగా కౌశల్ కు అలాగే కొంత మంది ఇంటి సభ్యులకు అస్సలు పడడం లేదు.కౌశల్ తో గొడవ పెట్టుకున్న వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోతారు అనే ఒక విషయం కూడా అందరికి అర్థం అయిపోతుంది.మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో తెలుసుకుందామా.

Related image

ఈ వారం ఎలిమినేషన్ లో బాబు గోగినేని,గణేష్,దీప్తి నల్లమోతు,తనిష్,గీతా మాధురి,శ్యామల ఉన్నారు.వీరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు.ముందు హౌస్ లో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే…బిగ్ బాస్ హౌజ్ లో మొదటి నుంచి కౌశల్ అందరికీ టార్గెట్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే హౌజ్ లో కౌశల్ ఎంత టార్గె అవుతున్నారో..బయట అతని బలం మరింత పెరిగిపోతుంది. ఇంటి సభ్యులందరిలోకెల్లా డిఫరెంట్‌ యాటిట్యూడ్‌తో ఉండే కౌశల్‌కు సోషల్‌ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. కౌశల్‌కు సపోర్ట్‌గా లెక్కలేనన్ని పేజీలు క్రియేట్‌ అయ్యాయి.కౌశల్ ఆర్మీ అనేది ఒకటి రన్ అవుతుంది.వీరంతా కలిసి గేమ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. వీరు ఆడిందే ఆటా పాడిందే పాట అనే స్థాయికి వచ్చేశారు. అంతే కాదు కౌశల్ ని టార్గెట్ చేసిన వారందరికి ఓట్లు వేయకుండా హౌజ్ నుంచి బయటకు పంపేలా పరిస్థితి తీసుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Image result for thanish

అయితే బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ ని తనీష్ బాబు గోగినేనిలు ఎలా ముప్పుతిప్పలు పెడుతూ విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే.. ఇన్నాళ్లు అయితే బాబు లేదంటే తనీష్ మాత్రమే నామినేషన్ లోకి వచ్చారు.కానీ ఈ వారం ఇద్దరూ ఎలిమినేషన్ కు నామినేట్ కావడంతో కౌశల్ ఆర్మీ సమాయత్తమైంది. బలమైన ఈ ఇద్దరిలోంచి ఒకరిని ఇంటికి పంపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సోమవారం బిగ్ బాస్ ఆసక్తికర టాస్క్ ఇచ్చాడు. బయట గార్డెన్ ఏరియాలో ఓ టెంట్ ను ఏర్పాటు చేసి ఇంటి సభ్యులందరూ ఎవరైతే ముందుగా అందులోకి వెళతారో వారంతా సేఫ్ అని.. చివర్లో వెళ్లిన వారు ఎలిమినేట్ అవుతారని పేర్కొన్నాడు. ఈ టాస్క్ లో బాబు గోగినేని, తనిష్ లు ఫెయిల్ అయ్యారు. ఇద్దరు ఒకేసారి నామినేషన్స్ లోకి రావడంతో కౌశల్ ఆర్మీ ఎలాగైనా సరే వీరిలో ఒకరిని బయటకు పంపించేందుకు దృష్టి పెట్టింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ముఖ్యంగా బాబు గోగినేనిని ఎలిమినేట్ చెయ్యాలని కౌశల్ ఆర్మీ డిసైడ్ అయ్యింది.కాబట్టి ఈవారం బాబు గోగినేని ఎలిమినేట్ అవ్వడం ఖయంలా ఉంది.బిగ్ బాస్ లీక్స్ ప్రకారం ఇప్పటివరకు వచ్చిన ఓట్లలో బాబు గోగినేనికి తక్కువగా వచ్చాయని తెలుస్తుంది.మరి చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కౌశల్ ఆర్మీ గురించి అది బయట చేస్తున్న రచ్చ గురించి అలాగే కౌశల్ తో గొడవ పెట్టుకున్న వాళ్ళు ఎలిమినేట్ అవుతున్న విషయం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.