ఆ విషయంలో కౌశల్‌, రాహుల్ సేమ్.. అందుకే సీజన్ 3 విన్నర్ అతడే

253

బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ ను రాహుల్ గెలుచుకున్నాడు. శ్రీముఖి, రాహుల్ మధ్య గట్టి పోటీ ఉన్నా కూడా అంతిమంగా విజయం రాహుల్ ను వరించింది. అయితే రాహుల్ విన్ అవ్వడానికి ఒక సెంటిమెంట్ ఉంది. ‘రాహుల్‌కి మహా బద్దకం.. అతని పని అతనే చూసుకోలేడు.. పునర్నవితో పులిహోర కలపడానికే బిగ్ బాస్ హౌస్‌కి వచ్చాడు.. అతను ఇన్ని వారాలు పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉండటమే ఎక్కువ.. అతనికి మహిళలంటే రెస్పెక్ట్ లేదు.. ఉదయాన్నే లేవడు.. టాస్క్‌లలో పెర్ఫామ్ చేయడు’’ ఈ కారణాలతో బిగ్ బాస్ సీజన్ 3 ఫైనలిస్ట్ రాహుల్ సిప్లిగంజ్‌ను పదే పదే నామినేట్ చేసేవారు. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 14 వారాల్లో 11 సార్లు నామినేషన్‌లోకి వెళ్లి.ఈ సీజన్‌లో ఎక్కువ సార్లు నామినేట్ అయ్యి సేవ్ అయిన కంటెస్టెంట్‌ అయ్యాడు. అయితే రాహుల్ 11 సార్లు నామినేట్ కావడమే అతన్ని ఫైనల్ విన్నర్ చేస్తుంది అంటున్నారు ఆయన సపోర్టర్స్.

Image result for telugu bigg boss winner

సీజన్ 2లో సాధారణ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి విజేతగా అవతరించిన కౌశల్ మందా కూడా ఆ సీజన్ అత్యధికంగా 11 సార్లు నామినేట్ అయ్యి చివరికి సీజన్ 2 విజేత అయ్యారని, ఇప్పుడు రాహుల్ కూడా 11 సార్లు నామినేట్ కావడంతో అతనే విజేత అంటూ ఈ 11 సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. ఈ సెంటిమెంట్ సంగతి పక్కన పెడితే శ్రీముఖి మంచి టఫ్ ఫైట్ ఇస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 విజేత కావడం రాహుల్‌కి అంత ఈజీ కాదని ఓటింగ్‌ని బట్టి తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఓటింగ్ సరళి ఎలా ఉంది? ఎవరికి ఎంత శాతం ఓటింగ్ వచ్చిందంటే.. టాప్ 5 కంటెస్టెంట్స్‌లో అలీ రెజా 4 శాతం ఓట్లతో చివరి స్థానంలో ఉన్నాడు. ఇక 15 శాతం ఓట్లతో వరుణ్ సందేశ్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక బాబా భాస్కర్ 19 శాతం ఓట్లతో వరుణ్ కంటే ముందంజలో ఉండి మూడుస్థానంలో ఉన్నారు. ఇక శ్రీముఖి, రాహుల్‌ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది.. వీరిద్దరూ 31 శాతం ఓట్లతో నువ్వా-నేనా అంటూ టైటిల్ కోసం గట్టిగానే పోరాడుతున్నారు. అయితే నిన్న మొన్నటి వరకూ శ్రీముఖి టైటిల్ విన్నర్‌గా ముందే ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరగ్గా ఇప్పుడు రాహుల్ విన్నర్ అంటూ పుకార్లు జోరందుకున్నాయి.

ఈ క్రింద వీడియో చూడండి

దీనికి తోడు రాహుల్ బయట సపోర్ట్ అంతకంతకూ ఎక్కువ కావడం, హైదరాబాద్ సెంటిమెంట్‌తో పాటు రాహుల్ తన నేటివిటీని ఒరిజినాలిటీని ఎక్కడా దాచుకోకుండా తను బార్బర్ అనే విషయాన్ని ప్రమోట్ చేసుకుని సెంటిమెంట్ వర్కైట్ చేస్తున్నాడు. ఈ విషయంలో శ్రీముఖి వెనుకబడటంతో రాహుల్‌కు విన్నర్ అయ్యాడు. శ్రీముఖి విన్ అని అందరు అనడంతో శ్రీముఖిలో ఎక్కడో తెలియని ఒక గర్వం వచ్చింది. దాంతో ఆమె కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది. ఇంట్లో రాహుల్ తో గొడవలు పెట్టుకోవడం, అతని ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా చేసిన కొన్ని కామెంట్స్ శ్రీముఖికి మైనస్ అయ్యాయి. అవే రాహుల్ విన్ అయ్యేలా చేశాయి.

ఈ క్రింద వీడియో చూడండి