కరణం మల్లీశ్వరి బయోపిక్.. బాలీవుడ్ హీరోయిన్..లేడి డైరెక్టర్..

403

వెండితెరపై వరుసగా బయోపిక్ లు వస్తున్నాయి. ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.ఇప్పటికే సిల్క్ స్మిత మహానటి సావిత్రి బయోపిక్ లు వచ్చాయి.త్వరలో ఎన్టీఆర్ వై ఎస్ ఆర్ బయోపిక్ లు రాబోతున్నాయి.అలాగే క్రీడా రంగంలోకి వస్తే ధోనీ సచిన్ బయోపిక్ లు వచ్చాయి.

ఇప్పుడు క్రీడా రంగానికి చెందినా వ్యక్తి బయోపిక్ రాబోతుంది. ఒలంపిక్స్ లో ఇండియా తరుపున మెడల్ సాధించిన తొలి మహిళ కరణం మల్లీశ్వరి. ఆమె తెలుగు మహిళ కావడం తెలుగువారందరికీ గర్వకారణం. ఇప్పుడు ఈమె జీవిత కథతో సినిమా తెరకేక్కబోతుంది.రాజుగాడు చిత్రంతో మహిళా దర్శకురాలు సంజన రెడ్డి గుర్తింపు పొందారు. ఆమె మల్లీశ్వరి బయోపిక్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వైట్ లిఫ్టింగ్ లో మెడల్ సాధించిన ఏకైక భారత మహిళ కరణం మల్లీశ్వరి.ఆమె జీవిత చరిత్రపై సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని సంజన రెడ్డి భావిస్తున్నారు. కరణం మల్లీశ్వరి పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావలసి ఉంది.