#RRR లో విలన్ గా క్రేజీ హీరో ? జక్కన్న ప్లాన్ మాములుగా లేదుగా !

339

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ రెడీ అయ్యింది. బాహుబలి తర్వాత ఆ స్థాయికి తగిన విధంగా సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలయికతో రేర్ కాంబినేషన్ సెట్ చేశారు. మెగా, నందమూరి అభిమానుల సపోర్టుతో ఈ సినిమా ఏ స్థాయికి వెళుతుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు.

ఇద్దరు స్టార్ హీరోలతో

ఇంతవరకు అపజయం అంటూ ఎరుగని దర్శకుడు ఒక వైపు అలాగే కలక్షన్స్ తో రికార్డులను సృష్టించే ఇద్దరు స్టార్ హీరోలు మరో వైపు. వీరి ముగ్గురి కలయికలో సినిమా వస్తుదంటే అంచనాలు ఏ స్థాయిలో వుంటాయో చెప్పనక్కర్లేదు.19 వ తేదీన ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.అయితే ఇందులో ఇప్పుడు ఒక క్రేజీ హీరోను విలన్ గా చూపించాలని జక్కన్న అనుకుంటున్నాడట.ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రలకు తగ్గట్లుగానే ఈ చిత్రంలో విలన్ పాత్రని తీర్చిదిద్దుతాడు అనడంలో సందేహం లేదు.

క్రేజీ హీరోగా

తాజాగా ఆర్ఆర్ఆర్ లో విలన్ పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. రోజు రోజుకు తన స్టార్ డమ్ పెంచుకుంటున్న కన్నడ యువహీరో యశ్ ఈ చిత్రంలో విలన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. యశ్ నటిస్తున్న తాజా చిత్రం కెజిఎఫ్ త్వరలో తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం భారీ ఆహార్యం ఉండే యశ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వార్తల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.