10 రోజుల్లో క‌మ‌ల్ విశ్వ‌రూపం-2

457

క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన విశ్వ‌రూపం 2 సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వెండితెర‌పై అల‌రించేందుకు రానుంది. ఈ సినిమా టెర్ర‌రిజం నేప‌థ్యంలో తెర‌కెక్కింది.. ఈ చిత్రంలో లీడ్ రోల్ లో లోక నాయ‌కుడు క‌మ‌ల్ న‌టిస్తున్నారు అనేది అంద‌రికి తెలిసందే… ఇందులో మ‌రో ఇంట్ర‌స్టింగ్ విష‌యం ఆయ‌నే ఈ సినిమాకు ద‌ర్శకుడు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు…ఆగష్టు 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుద‌ల అవుతోంది. ఈ సినిమాని స్వాంత్ర్యదినోత్సవం రోజున విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు.. కాని ఆ సెల‌బ్రేష‌న్స్ కు ముందే చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

Image result for vishwaroopam movie

ఇక రేపు క‌మ‌ల్ విశ్వ‌రూపం ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లో జ‌రుగ‌నుంది.. ఈ సినిమాకు అద్బుతమైన సంగీతాన్ని గిబ్రాన్ అందించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలువ‌నుంది.. ఇప్ప‌టికే క‌మ‌ల్ అభిమానులు ఈ సినిమాపై అనేక అంచ‌నాలు పెట్టుకున్నారు.

Image result for viswaroopam movie 2ఈ చిత్రంలో పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్ వంటివారు నటించారు.. ఇక 2013లో వచ్చిన విశ్వ‌రూపం సినిమాకు ఇది మ‌రో కొన‌సాగింపు చిత్రంగా వ‌స్తోంది.. ఇక ఆ సినిమా మంచి విజ‌యం అందుకోవ‌డంతో ఈ ప్ర‌య‌త్నం చేసారు చిత్ర‌యూనిట్.. మ‌రి చూద్దాం లోక‌నాయ‌కుడు ఈ సినిమాలో ఎలా అల‌రించాడో.