ఎన్టీఆర్ బయోపిక్ కోసం 25 రోజులు కేటాయించిన కళ్యాణ్ రామ్

348

తెలుగు వాళ్లందరికీ ఇలవేల్పు అయినా నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కుతున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఈ సినిమాలో బాలకృష్ణ తన తండ్రి పాత్రను చేస్తున్నాడు.విద్యాబాలన్ కైకాల సత్యనారాయణ,రానా,సుమంత్ లాంటి నటులు ఇందులో నటిస్తున్నారు.‘యన్‌టీఆర్’ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది.

Image result for ntr biopic

దర్శకుడు క్రిష్ ఈ చిత్రంలో కీలకమైన ఒక్కో పాత్రలని రంగంలోకి దించుతున్నాడు.త్వరలోనే ఏఎన్నార్ పాత్ర కోసం హీరో సుమంత్ కూడా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. తాజగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ కోసం 25 రోజుల కాల్ షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.త్వరలోనే కళ్యాణ్ రామ్ పాత్రకు సంబందించిన షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

Image result for ntr biopic kalyan ram

కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించబోతున్నాడు. హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించిన తరువాత ప్రచారంలో హరికృష్ణ రథ సారధిగా కీలక పాత్ర పోషించారు. ఆ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తుండడంతో ఆసక్తి నెలకొంది.