వెరీ ఇంట్రస్టింగ్‌ టైటిల్‌తో మన ముందుకు వస్తున్న కల్యాణ్ రామ్‌

271

నందమూరి వారసుడిగా సినిమాలలోకి వచ్చి తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. తమ్ముడు స్టార్ హీరోగా ఎదిగిన కూడా మనోడు ఇంకా సక్సెస్ ల కోసం ఎదురుచూస్తున్నాడు.అప్పుడెప్పుడో అతనొక్కడే సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసిన హిట్ రాలేదు.

Related image

మళ్ళి చాలా రోజుల తర్వాత పటాస్ సినిమాతో హిట్ కొట్టాడు. పటాస్‌ సినిమాతో బ్రేక్‌ వచ్చినట్టుగానే కనిపించినా తరువాత మళ్లీ గాడి తప్పాడు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడు.ప్రస్తుతం ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ గుహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా థామస్‌, షాలినీ పాండేలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

Image result for kalyan ram 118

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ‘118’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. కథలో ఈ నెంబర్‌కు చాలా ఇంపార్టెన్స్‌ ఉండటంతో అదే టైటిల్‌గా ఫిక్స్‌ చేసే ఆలోచనటో ఉన్నారట యూనిట్‌.