‘ఉయ్యాలా జంపాల’ దర్శకుడితో కల్యాణ్‌ రామ్‌..!

195

నందమూరి వారసుడిగా సినిమాలలోకి వచ్చి తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. తమ్ముడు స్టార్ హీరోగా ఎదిగిన కూడా మనోడు ఇంకా సక్సెస్ ల కోసం ఎదురుచూస్తున్నాడు.అప్పుడెప్పుడో అతనొక్కడే సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసిన హిట్ రాలేదు.మళ్ళి చాలా రోజుల తర్వాత పటాస్ సినిమాతో హిట్ కొట్టాడు.

Related image

పటాస్‌ సినిమాతో బ్రేక్‌ వచ్చినట్టుగానే కనిపించినా తరువాత మళ్లీ గాడి తప్పాడు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడు.ప్రస్తుతం ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ గుహన్ దర్శకత్వంలో 118 సినిమా చేస్తున్నాడు. ఒక డిఫరెంట్ కథతో ఈ సినిమా వస్తుంది. అయితే ఇప్పుడు మరొక సినిమాకు పచ్చజెండా ఊపాడు.

Image result for kalyan ram virinchi varma

ఉయ్యాలా జంపాల,మజ్ను సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మతో సినిమా చెయ్యడానికి సిద్దమయ్యాడు.ఈ ప్రాజెక్ట్‌ మార్చిలో ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌తో కలిసి జెమినీ కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగతుందట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రటకన వెలువడనుంది.