ఆసక్తి రేపుతున్న కళ్యాణ్ రామ్ ‘118’ టీజర్

271

నందమూరి వారసుడిగా సినిమాలలోకి వచ్చి తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. తమ్ముడు స్టార్ హీరోగా ఎదిగిన కూడా మనోడు ఇంకా సక్సెస్ ల కోసం ఎదురుచూస్తున్నాడు.అప్పుడెప్పుడో అతనొక్కడే సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసిన హిట్ రాలేదు.మళ్ళి చాలా రోజుల తర్వాత పటాస్ సినిమాతో హిట్ కొట్టాడు. పటాస్‌ సినిమాతో బ్రేక్‌ వచ్చినట్టుగానే కనిపించినా తరువాత మళ్లీ గాడి తప్పాడు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడు.

Image result for 118 movie

ప్రస్తుతం ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ గుహన్ దర్శకత్వంలో 118 సినిమా చేస్తున్నాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా థామస్‌, షాలినీ పాండేలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేయగా తాజాగా చిత్ర టీజర్‌ ను విడుదల చేసి సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశారు.

ఈ టీజర్‌లో మొదట కళ్యాణ్ రామ్, షాలిని పాండే లతో షూట్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలను చూపించి.. ఆ తర్వాత సస్పెన్స్ థ్రిల్లింగ్ సన్నివేశాలను కట్ చేసి.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. ఫిబ్రవరి 19వ తేదీన విడుదల చేయనున్నట్టు సమాచారం.