పాపం 2 ఏళ్ళుగా ఆ వ్యాధితో బాధపడుతున్న కాజల్.. ఆందోళనలో కుటుంబం

457

కలువకళ్ల కాజల్ అంటే మన అందరికి ఇష్టం.సినిమా ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ద కాలం అయిపోయింది.ఇప్పటికి సినిమాలలో నటిస్తూ తన అందంతో అభినయంతో మన అందరికి ఆకర్షిస్తుంది.అందాల భామ కాజల్ అగర్వాల్ 2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణంతో కెరీర్ ఆరంభించారు. కృష్ణవంశీ రూపొందించిన చందమామతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత కెరీర్‌లో వెనుకకు చూసుకోలేదు. 11 ఏళ్లు, 50పైగా చిత్రాల్లో నటించిన కాజల్.. ప్రస్తుతం నవతరం హీరోయిన్లకు గట్టిగా పోటీనిస్తున్నారు. తాజాగా ఆమె నటించిన కవచం రిలీజ్‌కు సిద్దమవుతున్న నేపథ్యంలో ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను పంచుకుంది.మరి ఆమె చెప్పిన విషయాల గురించి తెలుసుకుందామా.

Image result for kajal agrawala

కెరీర్ ఆరంభంలో స్టార్ హీరోలతో నటించాను. ఇప్పడు యంగ్ హీరోలతో నటిస్తున్నాను. ఇదంతా అనుకొని జరగడం లేదు. నేను ఎక్కువగా కథలు, బ్యానర్లపై దృష్టిపెడుతున్నాను. అందుకే ఇలాంటి విభిన్నమైన సినిమాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం నా కెరీర్‌ను బట్టి చూస్తే కాజల్ 2.0 అని భావించవచ్చు అని తెలిపింది.అయితే ఈ ఏడాది ఎక్కువగా సినిమాలు చెయ్యలేదు. దానికి కారణం ఏంటని అడిగితే..ఈ ఏడాది ప్రారంభంలో తను ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడినట్టు కాజల్ ప్రకటించింది. ఆ వ్యాధి పేరు ఆటో ఇమ్యూన్ డిజార్డర్. కాజల్ కు ఉన్న ఆరోగ్య సమస్య ఇది. అప్పటికప్పుడే హఠాత్తుగా రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, జ్వరం, ఒళ్లు నొప్పులు రావడం ఈ రోగ లక్షణం. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ బయటపెట్టింది. తను ఈ సమస్యతో దాదాపు 3 నెలలు మంచాన పడ్డానని ప్రకటించింది కాజల్.ఈ ఏడాది ప్రారంభంలో ఈ వ్యాధికి గురైంది కాజల్. ఓ సినిమా షూటింగ్ టైమ్ లో ప్రతి రోజు రాత్రి అయ్యేసరికి కాజల్ కు జ్వరం, ఒళ్లు నొప్పులు బాధించేవి. వరుసగా జ్వరం రావడంతో డాక్టర్లను సంప్రదించిన కాజల్, అసలు సమస్యను గుర్తించగలిగింది.

ఫలితంగా 3 నెలల పాటు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యానని, వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని తెలిపింది కాజల్. కవచం సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టింది కాజల్. నిజానికి ఈ హీరోయిన్ కు ఇంత తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉన్నట్టు ఎవరికీ తెలియదు. కనీసం గాసిప్స్ కూడా బయటకు రాలేదు. ఇదే విషయాన్ని కాజల్ కూడా చెప్పుకొచ్చింది. తన కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ ఈ విషయం తెలియదని, ప్రస్తుతం తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పుకొచ్చింది.ఏదేమైనా వచ్చే ఏడాది నుంచి తను సినిమాలు తగ్గిస్తానని ప్రకటించింది కాజల్. సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించమని దేవుడే ఈ వ్యాధి ద్వారా తనకు చెప్పినట్టు అనిపించిందని, ఇకపై ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి సినిమాలు తగ్గిస్తానని తెలిపింది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కాజల్ గురించి అలాగే ఆమెకు వచ్చిన ఈ అరుదైన వ్యాధి గురించి ఆమె చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.