కాజల్ లక్కీ ఛాన్స్..భారతీయుడు 2 లో కమల్ సరసన.

272

21 ఏళ్ల క్రితం విడుద‌లై తెలుగు, త‌మిళనాట బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం ‘భారతీయుడు’. ‘అవినీతి, లంచగొండితనం’లపై శంక‌ర్ ఈ చిత్రాన్ని మలిచిన తీరు అప్పట్లో ఓ హాట్ టాపిక్‌గా నిలిపింది. క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడుగా సినీ ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న‌తో అబ్బురపరిచాడు. ఇప్పుడు ఇదే కాంబినేసన్‌లో భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇండియ‌న్ 2’ తెరకెక్కబోతోంది.

Image result for indian2

అయితే ఇందులో కమల్ కు జోడిగా ఎవరిని తీసుకోవాలా అని శంకర్ సతమతమవుతుంటే కాజల్ మదిలోకి వచ్చింది.వెంటనే కాజల్ ను అడగడం ఆమె ఓకే అనడం జరిగిపోయింది.ఈ విషయాన్నీ స్వయంగా కాజల్ చెప్పింది.గతకొన్ని రోజులుగా వెనుకబడ్డ కాజల్ వరుస సినిమాలను ఒప్పుకుంటుంది.

Image result for kajal in bharateeyudu 2

ఇప్పుడు ఏకంగా విలక్షణ నటుడు కమల్‌‌తోనే నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అయితే కమల్‌తో కాజల్‌ నటించడం ఇదే తొలిసారి. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడంతో ఈ ముద్దుగుమ్మ ఆనందానికి అవధుల్లేవట.2019 ప్రథమార్ధంలో ‘భారతీయుడు 2’ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.