ప్రేమలో పడిన కాజల్ అగర్వాల్ ఎవరితో డేటింగ్ చేస్తున్నారంటే

465

సినీ పరిశ్రమకు వచ్చి దశాబ్దకాలం దాటినా కాజల్ అగర్వాల్ జోరు ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్, దక్షిణాది సినీ పరిశ్రమలనే తేడా లేకుండా కెరీర్‌ను యమస్పీడ్‌గా కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నది. ఖైదీ నంబర్ 150 చిత్రంలో చిరంజీవితో స్టెప్పులేసిన ఈ భామ.. తాజాగా యువ హీరో బెల్లంకొండ శ్రీనుతో కలిసి కవచంలో హడావిడి చేసింది. ఇలా నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తున్న కాజల్ తాజాగా సోషల్ మీడియాతో పాటు ఇంటర్నెట్‌ను హీటెక్కించింది. మిస్టరీ మ్యాన్‌తో డేటింగ్ చేసి మీడియాలో హల్‌చల్ చేసింది.

 మన సఖ్యత ఇలాగే కొనసాగాలని

వివరాల్లోకి వెళితే..కాజల్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో గుర్తు తెలియని వ్యక్తితో ఐస్ క్రీమ్ డేటింగ్ చేసినట్టు ఫొటో పోస్టు చేసింది. అయితే ఆ వ్యక్తి ఎవరో చెప్పకుండా గోప్యంగా ఉంచారు కాజోల్. తనకు ప్రత్యేకమైన వ్యక్తితో సమయాన్ని గడిపినట్టు పేర్కొన్నది. నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, అద్భుతమైన మనసున్న మనిషి అని పేర్కొన్నడంతో ఊహాగానాలు జోరందుకొన్నాయి.నాకు బాగా ఇష్టమైన, ఫేవరేట్ వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరాల్లో నీ జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లో వృద్ధిని సాధిస్తావని, మరింత పాపులారిటీ, ఫేంను సంపాదిస్తావని ఆశిస్తున్నాను.

 ఫేవరేట్ వ్యక్తికి బర్త్ డే విషెస్

నీవు కన్న కలలన్నీ నిజం కావాలని కోరుకొంటున్నాను అని కాజల్ తన సందేశంలో పేర్కొన్నారు.మన మధ్య ఉన్న సఖ్యత ఇలాగే కొనసాగాలని కోరుకొంటున్నాను. విరామం దొరికితే మనం బరువు పెరుగతామని, కేలరీలు పెరుగుతామనే భయం లేకుండా ఇలా ఐస్ క్రీమ్ పార్టీలో కలుసుకొందాం అని కాజల్ తన మనసులోని మాటను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు.కాజల్ అగర్వాల్ పోస్టు చేసిన ఫొటోపై అభిమానులు, నెటిజన్లు భారీగా స్పందించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కపుల్ వాచీలు, సింగిల్ స్పూన్ కాజల్ కేక పెట్టిస్తున్నారు. అబ్బాయిలు.. ఇంకేముంది.. ఆమె రిలేషన్‌లో ఉందని చెప్పకనే చెప్పారు అని ఓ నెటిజెన్ కామెంట్ చేయడం గమనార్హం.ఇక కెరీర్ విషయానికి వస్తే.. హిందీలో ఘన విజయం సాధించిన క్వీన్ చిత్ర రీమేక్‌ పారిస్ పారిస్‌లో కాజల్ నటించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఇంకా కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చే ఇండియన్ 2 చిత్రంలో నటించే ఆఫర్‌ను కాజల్ కొట్టేసింది.