అఖిల్ సినిమాకు ఒకే చెప్పిన చందమామ కాజల్.

325

అక్కినేని అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇంకా టైటిల్ ను అధికారికంగా ప్రకటించని ఈ సినిమాకు ‘Mr. మజ్ను’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ వెంకీ ‘తొలి ప్రేమ’ లాంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తో హిట్ సాధించాడు కాబట్టి ఈ సినిమాతో అఖిల్ కు హిట్ అందిస్తాడని అక్కినేని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

Image result for akhil venky atluri

అయితే ఇప్పుడు ఈ చిత్రం గురించి ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.అదేమిటి అంటే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోందట.ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల చందమామ కాజల్.కానీ ఆ విషయన్ని ఫిలిం యూనిట్ రహస్యంగా ఉంచిందట. మరి కాజల్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తోందనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. హీరోయిన్ గా నటిస్తోందా లేదా అన్నదానిపై కూడా క్లారిటీ లేదు.

 

కాజల్ కు ఈమధ్య తెలుగులో అవకాశాలు తగ్గిన మాట వాస్తవమే గానీ అలా అని సపోర్టింగ్ రోల్ చేసేది మాత్రం సందేహమే.మరి డైరెక్టర్ వెంకీ అట్లూరి కాజల్ అగర్వాల్ కోసం ఎలాంటి పాత్ర ను డిజైన్ చేసిపెట్టాడో ఏమో.