భరత్ అను నేను హీరోయిన్ కైరా అద్వానీ ఏంటీ ఇలా తయారయ్యింది..ఫేస్ సర్జరీ చేసుకుందా?

361

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ముంబై బ్యూటీ కియారా అద్వానీ. అందం పరంగా, నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తోంది.

సంబంధిత చిత్రం

కొన్ని రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయ్యే ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్‌లో సెక్స్ సీన్లతో మీడియాలో హాట్ టాపిక్ అయిన కియారా తాజాగా మరో వివాదంతో వార్తల్లోకి ఎక్కింది.ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో కియారా అద్వానీ బ్లాక్ లేస్ జంప్ సూట్‌తో దర్శనమిచ్చింది. ఆమె వేసుకున్న డ్రెస్సు బాగానే ఉంది కానీ ఆమె ఫేసులో మార్పులు చూసి అందరూ షాకయ్యారు.

కియారా ఫేసులో బుగ్గలు చూసిన అభిమానులు కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ తర్వాత ఆమె ఫేసు చూడలేక పోతున్నామని, ఆమె లుక్ చాలా టెర్రిబుల్‌గా ఉందనే కామెంట్స్ చేశారు.ఈ విషయంలో అనేక ట్రోల్స్ నడుస్తున్నాయి.