బంపర్ ఆఫర్ కొట్టేసిన కైరా అద్వానీ..అల్లుఅర్జున్ త్రివిక్రమ్ మూవీలో ఛాన్స్ ?

397

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ముంబై బ్యూటీ కియారా అద్వానీ. అందం పరంగా, నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.భ‌ర‌త్ అనే నేను చిత్రంతో వాటెండ్ భామ‌గా మారిపోయింది కైరా.అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Related image

భ‌ర‌త్ అనే నేను మూవీ కంటే ముందు హిందీలో మూడు చిత్రాల‌ను చేసింది కైరా.కానీ సరైన గుర్తింపు రాలేదు. భ‌ర‌త్ అనే నేనుతో కెరీర్ ట‌ర్న్ తీసుకుంది.క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న క‌లంక్‌లో న‌టిస్తుంది. అలాగే, అర్జున్‌రెడ్డి హిందీ వ‌ర్ష‌న్ క‌బీర్ సింగ్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంది.తెలుగులో ప్రస్తుతం రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తోంది.

Image result for allu arjun trivikram

బాలీవుడ్‌, టాలీవుడ్ ప్రాజెక్ట్స్‌కు ఈక్వెల్‌గా ఇంపార్టెన్స్ ఇస్తుంది.ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకుంది.త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్ స్టార్ న‌టించే చిత్రంలో కైరా న‌టించ‌డం ఆల్‌మోస్ట్ క‌న్ఫామ్‌గా క‌నిపిస్తుంది. డిసెంబ‌ర్ 11 నుంచి త్రివిక్ర‌మ్ బ‌న్నీ మూవీ సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.