కైకాల సత్యనారాయణ రియల్ స్టోరీ…

125

కైకాల సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాల్లో యముడి పాత్ర అనగానే గుర్తొచ్చేది కైకాల సత్యనారాయణ. 1959లో మొదలైన ఆయన సినీ ప్రస్థానం నేటికీ కొనసాగుతుంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఏ చిన్న పాత్ర ఇచ్చినా,ఏ చిన్న సినిమా అయినా నటించారు. అదే అతన్ని తెలుగు పరిశ్రమలో నిలబడేలా చేసింది. ఆనాటి తరం హీరోలు ఎన్టీఆర్ నుంచి నేటితరం జూనియర్ ఎన్టీఆర్ వరకు.అందరి స్టార్ హీరోల పక్కన నటించాడు. పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా ఏ పాత్రలో అయిన అలవోకగా చేయగలిగే నటుడు ఆయన..మరి ఆయన సినీ ప్రస్థానం ఎలా సాగింది.. ఆయన జీవితం మీద ఒక చిన్న స్టోరీ మీకోసం..

Image result for kaikala satyanarayana

బాల్యం, చదువు…
సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25 న జన్మించాడు. ఇతని తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. ఇతను వ్యవసాయం చేసేవాడు. ఇక సత్యనారాయణ తన స్కూల్ ఎజుకేషన్ ను గుడివాడ, విజయవాడలలో పూర్తిచేశాడు. తర్వాత గుడివాడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశాడు.

వ్యక్తిగత జీవితం…
సత్యనారాయణకు 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు మరియు ఇద్దరు కొడుకులు. ఇతని పెద్ద కొడుకు సినీ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు.

Image result for kaikala satyanarayana

సినీ జీవితం…
తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. అయితే అవతారం బాగాలేదని, నటుడిగా పనికిరావని అనేవారు. అయినా కానీ వెనుకడుగు వెయ్యకుండా అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఆయన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణకు మంచి పేరు వచ్చింది.సత్యనారాయణకు మంచి పేరు రావడానికి కారణం చూడటానికి అచ్చం ఎన్టీఆర్ లాగానే ఉన్నాడు. దాంతో ఎన్టీఆర్ కు డూప్ దొరికాడని ఇండస్ట్రీలో అనుకున్నారు. ఎన్టీఆర్ వరకు ఈ విషయం వెళ్ళింది. 1960లో ఎన్టీఆర్ తన అపూర్వ చింతామణి సినిమాలో ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి S. D లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు. సత్యనారాయణను విలన్ గా చూపించవచ్చు అని విఠలాచార్యకు ఐడియా వచ్చింది.

Image result for kaikala satyanarayana

ఇలా విఠలాచార్యకు వచ్చిన ఐడియా సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య కనకదుర్గ పూజా మహిమ సినిమాలో సత్యనారాయణ చేత విలన్ క్యారెక్టర్ వేయించాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. విలన్ గా బాగా చెయ్యడంతో ఇక తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ దొరికాడని అందరు సంబరపడ్డారు. ఆ తర్వాత చాలా సినిమాలలో విలన్ వేషాలు వచ్చాయి. అన్ని సినిమాలు కూడా పెద్ద హిట్ అవ్వడంతో కైకాల విలన్ గా సెటిల్ అయిపోయాడు. విలన్ గా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు. ఇలా ఆయన సంపూర్ణ నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఈయన వెయ్యని పాత్ర అంటూ లేదు. ఆయన ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో జీవించాడు. ముఖ్యంగా యమగోల మరియు యమలీల సినిమాలలో చేసిన యముడి క్యారెక్టర్స్ సినీ రంగం ఉన్నంతకాలం ఉంటాయి. కృష్ణుడు, రాముడు అంటే ఎన్టీఆర్, అభిమన్యుడు అంటే అక్కినేని, ఘటోత్కచుడు అంటే ఎస్.వి.రంగారావు ఎలా గుర్తుకువస్తారో యముడు అంటే సత్యనారాయణ గుర్తుకువస్తారు. ఎస్.వి.రంగారావు పోషించిన పాత్రలను చాలా వరకు సత్యనారాయణ పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు.. సాంఘికాల్లో రౌడీ, హీరోహీరోయిన్స్ కు తండ్రి, తాత లాంటి క్యారెక్టర్స్ లలో నటించాడు. ఒక్కసారి సత్యనారాయణ సినిమాల విషయానికి వస్తే…

ఈ క్రింద వీడియోని చూడండి

సిపాయి కూతురు, అగ్గిపిడుగు, జమిందార్, చిక్కడు దొరకడు, బంగారు పంజరం, తాతమనువడు, నిప్పులాంటి మనిషి, తూర్పు పడమర, యమగోల, వేటగాడు, ముగ్గురు మొనగాళ్లు, కొండవీటి రాజా, ఆఖరి పోరాటం, ఖైదీ నెంబర్ 786, యముడికి మొగుడు, ఘరానా మొగుడు, యమలీల, ఘటోత్కచుడు..ఇలా చెప్పుకుంటూపోతే ఇప్పటివరకు 777 సినిమాలలో నటించాడు. ఇన్ని చిత్రాలలో వివిధ పాత్రలలో నటించి మనల్ని అలరించాడు కాబట్టే సత్యనారాయణను నవరస నటనా సార్వభౌమ అని అంటారు. ఇక సత్యనారాయణ ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని చిత్రాలను నిర్మించాడు. రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు.

Related image

రాజకీయ జీవితం..
1996లో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి 11 వ లోక్ సభ ఎన్నికలలో మచిలీపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందాడు. అయితే తర్వాత ఇక రాజకీయాలు తనకు సరిపడవని 2001 లో రాజకీయాలను వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత మళ్ళి సినిమాలలో నటించాడు.

అవార్డ్స్…
2017 లో ఫిలింపేర్ లైఫ్ అచీవ్ మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించింది. 2011 లో రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది. 1994 లో సత్యనారాయణ నిర్మించిన బంగారు సినిమాకు గాను బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం గా నంది అవార్డు వచ్చింది. ఇవేకాకుండా ఎన్టీఆర్ విజ్ఞాన్ అవార్డు, నటశేఖర అవార్డును రెండుసార్లు అందుకున్నాడు. కావలి అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే కళాప్రపూర్ణ అవార్డు అందుకున్నాడు. ఇవే కాకుండా అయన పోషించిన ఎన్నో చిత్రాలలో నటుడిగా ఎన్నో అవార్డ్స్ అందుకున్నాడు. బెస్ట్ విలన్ గా, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు.

Image result for kaikala satyanarayana

ఇలా కైకాల సత్యనారాయణ గురించి చెప్తే రోజులు సరిపోవు. తెలుగు ఇండస్ట్రీలో సువర్ణాక్షరాలతో రాయాల్సిన పేరు ఆయనది. ఆయన చేసిన సినిమాలు, పోషించిన పాత్రలు మన మదిలో ఎప్పటికి ఉండిపోయతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి కైకాల సత్యనారాయణ మీద మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసిషేర్ చెయ్యండి. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మీరు ఇంతవరకు మా ఛానెల్ కు సబ్ స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్ స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.