ఎన్టీఆర్ బ‌యోపిక్ లో కైకాల

373

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న తండ్రి నంద‌మూరి ఎన్టీఆర్ చిత్రాన్ని బ‌యోపిక్ గా తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.. ద‌ర్శకుడు క్రిష్ కుఈ సినిమా బాధ్య‌త‌లు అప్ప‌గించారు… ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది…ఈ చిత్రం ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అంద‌ర్నీ పెద్ద పెద్ద న‌టుల్ని ఎంపిక చేసుకున్నారు బాల‌య్య …త‌న కుటుంబ స‌భ్యుల పాత్ర‌కు స‌రైన న‌టీన‌టుల‌ను ఆయ‌న ఇప్ప‌టికే ఫైన‌ల్ చేశారు అని తెలుస్తోంది.

Related image

ఈ బ‌యోపిక్ లో ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక కైకాల స‌త్య‌నారాయ‌ణ కూడా ఈ సినిమాలో న‌టించ‌నున్నారు అనేది ఫైన‌ల్ గా తెలియ‌చేశారు. లెజెండరీ దర్శకులు హెచ్‌ఎం.రెడ్డి పాత్రలో కైకాల సత్యనారాయణ కనిపించనున్నారని ద‌ర్శ‌కుడు క్రిష్ కైకాల పుట్టిన రోజు సంద‌ర్బంగా ఓ పిక్ ని జ‌తచేసి తెలియ‌చేశారు.

Image result for kaikala satyanarayana

కాళిదాసు- భక్తప్రహ్లాద లాంటి చిత్రాలతో దక్షిణ భారతీయ సినిమాకి పునాది వేసిన పితామహుడు హెచ్‌ఎం రెడ్డి. అలాంటి లెజెండరీ పాత్రను మాహానటుడు కైకాల సత్యనారాయణ అమోఘమైన పద్ధతిలో రంజింపజేశారని దర్శకుడు క్రిష్ తెలిపారు. ఇటు యాత్ర మ‌రోవైపు ఎన్టీఆర్ బ‌యోపిక్ ల‌పై చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో.