క్యాస్టింగ్ కౌచ్‌పై కాజల్..ఆఫర్ల కోసం దిగజారలేదు.

371

దక్షిణాదిలో అగ్రహీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్.ఈమె అందానికి అభిమాని కాని వాడు అంటూ ఎవ్వడు లేడు.అయితే ఎప్పుడు తన పని తాను చేసుకునే కాజల్ ఎప్పుడు వివాదాల్లో లేదు.అయితే మొదటిసారి తను ఒక విషయంలో దూరింది.అది ఏమిటో కాదు ఇండస్ట్రీ పెను భూతం కాస్టింగ్ కోచ్.ఇటీవల కాలంలో ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.దీని మీద కాజల్ మాట్లాడింది.

సినిమా పరిశ్రమలో నిజంగా నేను అదృష్టవంతురాలిని.దాదాపు 10 ఏళ్ల కెరీర్‌లో నాకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని ఆమె వెల్లడించారు.క్యాస్టింగ్ కౌచ్ గురించి వినడం తప్ప అది ఉన్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. అసలు ఇలాంటి సమస్య హీరోయిన్లకు నిజంగా ఎదురవుతుందా? లేదా? అని కాజల్ పేర్కొన్నారు. సమాజంలో మగవాళ్లను బాధ్యతాయుతంగా ఉండాలని నేను కోరుతాను.

ఆడపిల్లలకు సురక్షితంగా ఉండాలని పాఠాలు, నీతులు చెప్పడం కాదు ఆచరణలో పెట్టి చూపించాలి. ప్రతీ ఇంటిలో అమ్మాయి ఉండటం సహజం. వారిపట్ల మర్యాదగా వ్యవహరించాల్సిందే అని కాజల్ అన్నారు.ఇంతకముందు రకుల్ ఈ విషయం మీద ఇలాగే అంటే శ్రిరెడ్డి రకుల్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది.మరి ఇప్పుడు కాజల్ మీద శ్రిరెడ్డి ఎలాంటి కామెంట్స్ చేస్తుందో చూడాలి..