యంగ్ హీరోతో కాజల్ కికి ఛాలెంజ్..పోలీసులకు కోపం రాకుండా ఎలా చేశారో తెలుసా..

394

కికి ఛాలెంజ్ పేరు వింటే యువత ఊగిపోతున్నారు. యువతకు ప్రస్తుతం కికి ఛాలెంజ్ ఫీవర్ పట్టుకుంది. సెలెబ్రిటీలు సైతం కికి ఛాలెంజ్ కు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కికి ఛాలెంజ్ ప్రమాదాలకు కారణం అవుతుండడంతో హైదరాబాద్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ మద్యనే రెజినా ఆదాశర్మ ఈ కికి చాలెంజ్ లో పాల్గొన్నారు.తాజగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా కికి ఛాలెంజ్ లో భాగమైంది.

బెల్లంకొండతో జంటగా

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తోంది.షూటింగ్ స్పాట్ లో ఖాళీ సమయాన్ని కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ సరదాగా గడిపారు. కికి ఛాలెంజ్ కు స్టెప్పులు ఇరగదీశారు.కికి ఛాలెంజ్ పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ ఎలా చేశారు అనే సందేహం రావచ్చు. పోలీసులకు కోపం రాకుండా మేనేజ్ చేశారు. శ్రీనివాస్, కాజల్ ఓ వీల్ చైర్ లో కూర్చుని ఈ కికి ఛాలెంజ్ కు డాన్స్ చేయడం విశేషం.ఈ వీడియోని కాజల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మిమ్మలి సంతోష పరచడానికే కికి ఛాలెంజ్ లో పాల్గొన్నాం. దానికంటే ముందుగా నిబంధనల్ని కూడా పాటించాలి. అందుకే వీల్ చైర్ లో కికి ఛాలెంజ్ డాన్స్ చేసినట్లు కాజల్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.