వెండితెర మీద k.విశ్వనాథ్ జీవిత చరిత్ర….పేరు విశ్వ దర్శనం..

432

దక్షినాది అగ్ర దర్శకులలో k.విశ్వనాథ్ ఒకరు.ఆయన తీసిన ప్రతి చిత్రం ఆణిముత్యమే.తెలుగు సినిమా చరిత్రలో చిరకాలం నిలిచిపోయే శంకరాభరణం సినిమా తీసింది కూడా ఈయనే.ఈ ఒక్క చిత్రమే కాదు ఎన్నో మరుపురాని చిత్రాలు తీశాడు ఈయన.ఇప్పుడు ఈయన జీవిత చరిత్ర వెండితెరపైకి రానుంది.

‘విశ్వదర్శనం’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురుపూర్ణిమ సందర్భంగా నేడు హైదరాబాద్‌లో జరిగాయి. ‘వెండి తెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అనేది ట్యాగ్‌లైన్‌. రచయిత, దర్శకులు జనార్ధన మహర్షి దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.శుక్రవారం జరిగిన వేడుకలో కె. విశ్వనాథ్‌ దంపతులు పాల్గొన్నారు.

సినిమా స్క్రిప్ట్‌ని దర్శకుడు జనార్ధన మహర్షికి కె. విశ్వనాథ్‌ దంపతులు, తనికెళ్ల భరణి, చిత్రనిర్మాత టి.జి. విశ్వప్రసాద్, చిత్రసహనిర్మాత వివేక్‌ కూచిభొట్ల అందజేశారు. ఈ చిత్రానికి స్వరవీణాపాణి స్వరకర్త. ఈ వేడుకలో విశ్వనాథ్‌గారి దంపతులను సత్కరించారు చిత్రబృందం.