బ్రేకింగ్ న్యూస్: దర్శకుడు రాఘవేంద్రరావుకు కారు ప్రమాదం

521

ఈ మద్య రోడ్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.ప్రభుత్వం రోడ్ సెఫ్టీ రూల్స్ ఎన్ని చేపట్టినా అవతల వారి వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారు.ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించక అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇక ఈమధ్య సెలబ్రిటీస్ ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ లో మరణించడం జరుగుతుంది.ఇప్పుడు కూడా మరొక ప్రముఖ నటుడు కారుకు ప్రమాదం జరిగింది.మరి అతను ఎవరు అతని పరిస్థితి ఎలా ఇప్పుడు ఎలా ఉందొ తెలుసుకుందాం.

తెలుగు సినిమా చరిత్రలో ఆయనది ఒక శకం.సినిమాకు రంగులు అద్ది పాత ధోరణిలో కాకుండా ఒక కొత్త పంథాలో సినిమాలు తీసిన వ్యక్తి ఆయన.గ్లామర్ అద్ది సినిమాలు తీసి ఎన్నో హిట్స్ అందుకున్నారు. అయితే ఈయన గురించి ఇప్పుడోక బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది.రాఘవేంద్ర రావు కు పెను ప్రమాదం తప్పింది.ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కారుకు ప్రమాదం జరిగింది. సోమవారం (ఆగస్టు 27) సాయంత్రం ఆయన తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్‌ రోడ్డులో కారు అదుపుతప్పి పిట్ట గోడను ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రాఘవేంద్రరావు వ్యక్తిగత సహాయ సిబ్బంది మురళి, సుమన్‌, కారు డ్రైవర్‌ బాలాజీకి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ బాలాజీని ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ప్రమాద సమయంలో రాఘవేంద్రరావు మరో కారులో తిరుమలకు వెళ్తున్నారు.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌‌గా ఉన్న రాఘవేంద్రరావు తరచూ తిరుమలకు వెళ్లే విషయం తెలిసిందే. ప్రమాద వార్త విని పలువురు ప్రముఖులు రాఘవేంద్రరావుకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. టీటీడీ కేటాయించిన వాహనం కాకుండా మరో వాహనంలో ప్రయాణించడం వల్లే ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు.లేకుంటే ఈరోజు ఆయన మన కళ్ళ ముందు ఉండేవాడు కాదని తెలుస్తుంది.దీని గురించి రాఘవేంద్ర రావు మాట్లాడుతూ ఇలా జరగడం దురదృష్టకరం.నాకు ఏమి కానందుకు సంతోశాపడాలో లేక నా సిబ్బందికి గాయలయినందుకు బాధ పడాలో అర్థం అవ్వడం లేదు.అంతా మంచి జరిగేట్టు ఆ వెంకన్న స్వామీ చూసుకుంటాడని ఆయన తెలిపారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.రాఘవేంద్ర రావు కు జరిగిన ప్రమాదం గురించి అలాగే కారు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.