ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలకృష్ణగా జూ. ఎన్టీఆర్..?

440

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా యన్.టి.ఆర్.తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం భారీ అంచనాలున్న సినిమాల్లో ‘యన్.టి.ఆర్’ ఒకటి. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని పాత్రల ఎంపికను చాలా జాగ్రత్తగా చేపడుతున్నారు.

చాలా మంది ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు.విద్యాబాలన్ కైకాల సత్యనారాయణ రానా లాంటి నటులు నటిస్తున్నారు.అయితే ఇందులో బాలకృష్ణ పాత్రను ఎవరు చేస్తారా అని అందరు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఎన్టీఆర్ జీవితంలో బాలకృష్ణ పాత్ర కూడా చాలా కీలకమైనదే.అయితే బాబాయ్ బాలయ్యగా ఎన్టీఆర్ నటించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

బాలకృష్ణ పాత్రలో ఎన్టీఆర్‌ను నటింపజేయాలన్న ప్రతిపాదనను దర్శకుడు క్రిష్ తెరపైకి తీసుకురాగా, అందుకు బాలకృష్ణ కూడా సుముఖంగా ఉన్నట్టు సమాచారం. అయితే బాలకృష్ణగా ఎన్టీఆర్ చేయడానికి సిద్ధపడుతాడా అనే విషయంపై ఓ అంచనాకు రావడం కష్టమే. బాలకృష్ణగా ఎన్టీఆర్ చేస్తే నందమూరి ఫ్యాన్స్‌కు పండుగే అని చెప్పవచ్చు.