లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చూసి ఎన్టీఆర్ ఏమన్నాడో తెలిస్తే షాక్..

501

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో బయోగ్రాఫికల్‌ మూవీ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన సంఘటనలు లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమానురాగాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించాడు. ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసిన వెన్నుపోటు అంశంపై సినిమాలో చర్చించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సినిమా విడుదలను అడ్డుకునేందుకు శతవిదాల ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రిలీజ్‌పై స్టే విధించటంతో ఇతర ప్రాంతాల్లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Image result for ntr

ఒక్క ఏపీలో తప్పా అన్ని చోట్ల ఈ సినిమాను రిలీజ్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది అని టాక్ వచ్చింది. వర్మ సినిమాను తెరకెక్కించిన విధానం అందరికి బాగా నచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర పోషించిన విజయ్ కుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక లక్ష్మి పార్వతి పాత్ర పోషించిన యజ్ఞశేట్టి కూడా మంచి నటనను కనపరిచాడు. ఇక చంద్రబాబు పాత్ర పోషించిన శ్రీతేజ్ కూడా మంచిగానే నటించాడు. కుళ్ళు కుతంత్రాలను వర్మ చాలా చక్కగా చూపించాడు. వైస్రాయ్ హోటల్ ఘటనను పార్టీని చంద్రబాబు లాక్కున్న విధానాన్ని లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ను ఎందుకు పక్కన పెట్టారు లాంటి విషయాలను బాగా చూపించారు ఆర్జీవీ. అయితే ఈ సినిమా మీద సామాన్య ప్రేక్షకులకే కాదు సినీ సెలెబ్రెటీలకు కూడా ఆసక్తి ఉంది. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు ఈ సినిమా చూశారు.

అందులో మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమాను చూసి మీడియాతో తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది మా తాతగారి పరువును తీసే సినిమా అయినా కానీ ఆయన జీవితంలో మాకు కూడా తెలియని విషయాలు ఉన్నాయని వాటిని తెలుసుకుందామని ఈ సినిమాకు వచ్చాను. వర్మ చూపించిన విషయాలు నిజమో కాదో నాకు అంతలా తెలీదు. కానీ వర్మ ఏమేమి చూపించాడో తెలుసుకుందామని సినిమాకు వచ్చాను.వర్మ చూపించినట్టు మా నందమూరి కుటుంబం తాతగారిని దూరం పెట్టలేదు. అది ఆయన అభిప్రాయం మాత్రమే. ఇలా అబద్దాలను చూపిస్తే అది నిజం అని జనాలు అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి జనాలకు ఒకటి చెపుదాం అనుకుంటున్న. ఇది పూర్తీగా వర్మ ఆలోచన మాత్రమే తప్ప. ఇందులో నిజం లేదు అని మీడియా దగ్గర ఎన్టీఆర్ అన్నాడు.మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మీద ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.