ఆద‌ర్స్ కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న జూ- ఎన్టీఆర్

412

అర‌వింద స‌మేత ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.. మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ అలాగే హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న చిత్రం ఇది.. ఇక ఈ సినిమాపై ఇప్ప‌టికే తారక్ అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు…. తాజాగా ఈ సినిమాలో కొన్ని కీల‌క పాత్ర‌ల్లో న‌టించేందుకు సీనియ‌ర్ల‌కు అలాగే కొత్త వారికి అవ‌కాశం క‌ల్పిస్తున్నార‌ట‌… ఈ వార్త‌లు కొద్ది రోజులు గా వినిపిస్తున్నాయి.

Image result for adarsh tollywood actor

అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న బిగ్‌బాస్ వన్ కంటెస్టెంట్ ఆదర్శ్ బాలకృష్ణ, త్రివిక్రమ్ – ఎన్టీఆర్‌తో ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ వైరల్ అవుతుంది. దీనికి ఓ కార‌ణం కూడా ఉంది. గ‌తంలో బిగ్ బాస్ వ‌న్ లో కంటెస్ట్ చేసిన స‌మ‌యంలో చివరి నిముషంలో బిగ్‌బాస్ వన్ విన్నర్ గా నిలిచే అవకాశాన్ని కోల్పోయాడు ఆదర్శ్.

Image result for adarsh tollywood actor

అప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ అత‌నికి ఓ అవ‌కాశం ఇచ్చారు.. త్వ‌రలో మ‌నం ఓ సినిమా చేయ‌బోతున్నాం అని అప్పుడే హామీ ఇచ్చారు.. ఆ మాట ప్ర‌కారం అర‌వింద స‌మేత చిత్రంలో ఆద‌ర్శ్ కు అవ‌కాశం ఇచ్చారు జూనియ‌ర్ ఎన్టీఆర్ అని తెలుస్తోంది… ఈ సినిమా ఈ ఏడాది ద‌స‌రా కానుక‌గా రానుంది. ఈ చిత్రానికి సంగీతం త‌మ‌న్ అందిస్తున్నారు.