టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి కూతురు జాన్వీ.. విజయ్ దేవరకొండతో రొమాన్స్కు సిద్ధం?

296

అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో అడుగుపెట్టనుందా అనే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.. ‘దఢక్’ సినిమాతో బాలీవుడ్‌లో మంచి హిట్ సాధించిన జాన్వీ.జాన్వీ ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘తఖ్త్’ అనే చారిత్రక చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, ఆలియా భట్, భూమి పెడ్నేకర్, విక్కీ కౌశల్ తదితరులు నటిస్తున్నారు.

Image result for jhanvi kapoor

అయితే ప్రస్తుతం జాన్వీ దక్షిణాది సినిమాల్లో నటించేందుకు జాన్వీ సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి.తల్లి శ్రీదేవికి దక్షిణాదిలో ఉన్న పాపులారిటీ, అభిమానులను దృష్టిలో పెట్టుకుని జాన్వీ తెలుగు సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. ఇదే సమయంలో తెలుగు నుంచి ఆమెకు ఆఫర్ వచ్చినట్లు తెలిసింది.

మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న తర్వాతి చిత్రంలో విజయ్ దేవరకొండ నటించనున్నాడు. విజయ్ బంధువు యాష్ రంగినేని కూడా ఈ సినిమాకు రెండో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా నటించేందుకు జాన్వీని సంప్రదించారు. అయితే, జాన్వీ నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడి కాలేదు.ఇదే నిజమైతే అతిలోకసుందరి కూతురి నటనను చూసే అదృష్టం తెలుగు ప్రేక్షకులకు దక్కే అవకాశము ఉంది.చూడాలి మరి ఆమె ఈ ఆఫర్ ను ఒప్పుకుంటుందో లేదో.