బయటపడ్డ నటి ఝాన్సీ, ప్రియుడి వాట్సాప్ చాట్..ఏం మాట్లాడుకున్నారో చూసి పోలీసులు షాక్

216

వెండితెర బుల్లితెర మీద నటించి మనల్ని అలరించే నటీనటులు వివిధ కారణాల వలన ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు వర్దమాన టీవీ నటి ఝాన్సీ బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్లోని శ్రీనగర్కాలనీలో తన నివాసంలో ఆమె మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాటీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది ఝాన్సీ. మంగళవారం రాత్రి తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్న ఝాన్సీని, ఆఫీసు నుంచి వచ్చిన ఆమె సోదరుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, అప్పటికే ఆమె మృతిచెందినట్టు నిర్ధరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.

Related image

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని కడలి గ్రామానికి చెందిన ఝాన్సీ, సినిమాల్లో అవకాశాలు వెదుక్కొంటూ హైదరాబాద్కు వచ్చింది. పవిత్రబంధం సీరియల్తోపాటు మరో రెండు సినిమాల్లోనూ నటించిన ఆమె, తన తల్లి, సోదరుడితో కలిసి శ్రీనగర్కాలనీలో నివాసం ఉంటోంది.అయితే ఝాన్సీ బలవన్మరణానికి ప్రేమ వ్యవహరమే కారణమని తెలుస్తోంది. అయితే ఇంట్లో ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని వెతకగా ఆమె ఫోన్ దొరికింది. అందులో ప్రియుడు నానితో చేసిన వాట్సాప్ చాట్ దొరికింది. ఇద్దరు కలిసినప్పటి నుంచి మాట్లాడుకున్న విషయాలన్నీ అందులో ఉన్నాయి. మొదట్లో ఇద్దరు స్నేహితులు మాట్లాడుకున్నట్టే మాట్లాడుకున్నారు. కానీ రానురాను ఇద్దరి మధ్య స్నేహం పెరిగి అర్ధరాత్రి వరకు కూడా చాటింగ్ చేసుకున్నారు. అయితే ముందు నాని ఝాన్సీకి ప్రపోజ్ చేసినట్టు తెలిసింది. ముందు నాని ప్రపోజ్ చేస్తే ఝాన్సీ తిరస్కరించింది. అయితే నాని ఆమెను కన్వీన్ చేసి ఆమె ప్రేమను ఒప్పుకున్నట్టు చేశాడు.ఆ సమయంలో ఇద్దరి మధ్య కొన్ని ప్రేమ ముచ్చట్లు కూడా జరిగాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఆ తరువాత కొన్ని రోజుల వరకు ఇద్దరి మధ్య చాటింగ్ ఎక్కువగా జరగలేదు. అంతా ఫోన్ లోనే మాట్లాడుకున్నారు. అయితే ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాక మళ్ళి ఎక్కువగా చాటింగ్ ద్వారానే మాట్లాడుకున్నారు . నానిని ఝాన్సీ ఎక్కువగా బ్రతిమలాడినట్టు తెలుస్తుంది. ఝాన్సీ ఫోన్ చేస్తే నాని ఎత్తట్లేదని మెసేజ్ చేసింది. ఇద్దరి మధ్య చాటింగ్ లోనే గొడవలు జరిగాయి. కొన్నిసార్లు నాని భూతులు కూడా మాట్లాడాడు. అయితే నేను చనిపోతా అని ఝాన్సీ అంటే చచ్చిపో అని నాని అన్నాడు. ఆ మాటకు తట్టుకోలేకనే ఝాన్సీ చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ చాటింగ్ చూసి పోలీసులే షాక్ అయ్యారంట.మరి ఝాన్సీ ఆత్మహత్య గురించి అలాగే నానికి ఝాన్సీకి మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.