మా అధ్యక్ష పదవికి జయసుధ?

335

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (మా)లో నిధుల అవకతవకల వార్తలు సంచలనం రేపిన సంగతి మన అందరికి తెలిసిందే.మా అధ్యక్షుడు శివాజీరాజాపైనే ఏకంగా ఆరోపణలు రావడంతో పలు అనుమానాలు తలెత్తాయి. మా అధ్యక్ష పదవి నుంచి శివాజీ రాజా తప్పుకొంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. దాంతో ఆ పదవికి జయసుధ పేరు బలంగా వినిపిస్తున్నది.

jayasudha కోసం చిత్ర ఫలితం

మా అధ్యక్ష పదవికి జయసుధ అయితే హుందాగా ఉంటుంది. ఆ పదవికి, సంస్థకు ప్రతిష్ఠ కలుగుతుంది. ఆమె సరైన వ్యక్తి. మా సంఘానికి విశేష సేవలందించిన అనుభవం ఉంది అని పలువురు సినీ నటులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.మా వివాదాల మధ్య ఆ పదవి చేపట్టాల్సి వస్తే అందుకు జయసుధ సానుకూలంగా లేనట్టు తెలుస్తున్నది. గతంలో రాజేంద్ర ప్రసాద్ చేతిలో ఆమె పోటీ చేసి ఓటమిపాలైంది.

jayasudha కోసం చిత్ర ఫలితం

మా అధ్యక్ష పదవిని చేపట్టే ఆసక్తి తనకు లేదని విషయం జయసుధ తన సన్నిహితులతో చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం వయసు మీద పడటం వల్ల ఆరోగ్యం సహకరించడం లేదనే విషయాన్ని సాకుగా చూపినట్టు తెలిసింది.అందుకే మరొక కొత్త నటుడి కోసం అన్వేషిస్తున్నారు.చూడాలి మరి మా లో ఏం జరుగుతుందో..