బుల్లితెరపై జ‌య‌ప్ర‌ద‌

420

ఆనాడు టాలీవుడ్ లో ఆమె సినిమాలు సూప‌ర్ హిట్ …ఇక ఆమె సినిమాలు ఇప్ప‌టికీ టీవీల్లో చూస్తుంటే ఏమి న‌ట‌న ఏమి నాట్యం అని అభిన‌యానికి సైతం అనేక ప్ర‌శంస‌లు ఈనాటి యువ‌త కూడా ఇస్తారు.. ఆమె ఎవ‌రో కాదు అల‌నాటి అందాట న‌టి జ‌య‌ప్ర‌ద‌.. ఇక ఆమె రాజ‌కీయాల్లో కూడా త‌న‌దైన ముద్ర వేశారు… వెండి తెర నుంచి రాజ‌కీయాల్లోకి వెళ్లి హ‌స్తిన రాజ‌కీయాల్లో కూడా ఆమె చక్రం తిప్పారు.. ఆమెని యూపీ ప్ర‌జ‌లు కూడా ఆద‌రించారు.

Image result for jayaprada

తాజాగా ఆమె బుల్లితెర‌లో త‌న న‌ట‌న‌తో అల‌రించ‌నున్నారు అని తెలుస్తోంది… అస‌లు వివరాల్లోకి వెళ్తే హిందీలో ప్రసారమవబోయే పర్ఫెక్ట్ పతి షోలో ఆమె ఓ ముఖ్యమైన పాత్ర చేయనున్నారు..ఈ షోలో జయప్రద తల్లి పాత్రలో కనిపించనున్నారు అని తెలుస్తోంది.ధైర్యవంతమైన మహిళగా ఆమె పాత్ర ఉండనుంది.

Image result for jayaprada

బుల్లితెర పై ఆమె నటిస్తుండటం పై జయప్రద మాట్లాడుతూ తన జీవితంలో వచ్చిన ఈ కొత్త కోణాన్ని ఎంజాయ్ చేస్తున్నానని, ఐతే టీవీ మాధ్యమం ఎంతో శక్తివంతమైన మాధ్యమం అని, ధైర్యవంతమైన మహిళా పాత్రను తనకు పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.మొత్తానికి బుల్లితెర‌లో కూడా ఆమె మ‌రింత ప్ర‌శంస‌లు అందుకోవ‌డం ఖాయం అంటున్నారు.. అయితే అది హిందీలో కాబట్టి తెలుగులో ఎటువంటి షో వ‌చ్చినా ఆమె చేసేందుకు మ‌రోసారి సిద్దం అని తెలుస్తోంది.