జయలలిత బయోపిక్ ‘ది ఐరన్ లేడీ’ ఫస్ట్ లుక్ విడుదల…. అదరగొట్టేసిన నిత్యామీనన్..

131

తమిళనాడులో జయలలిత ఒక సంచలనం.జయలలిత జీవితంలో అనేక సంఘటనలు ఉన్నాయి. అనేక అనుమానులు ఎదుర్కొన్నారు. ప్రతిసారి గోడకు కొట్టిన బంతిలా దూసుకొస్తూ పార్టీని విజయపథంలో నడిపించారు. ప్రజలచేత అమ్మా అని పిలిపించుకునేంత అభిమానం సొతం చేసుకున్నారు. జయలలితపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరకు జయలలిత మరణంపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి.

జయలలిత మరణం

నటిగా కెరీర్‌‌ని ఆరంభించి దక్షిణాదిలో తిరుగులేని స్టార్‌గా అవతరించింది. ఆ తరువాత ప్రముఖ నటుడు ఎంజీఆర్ వద్ద రాజకీయ ఓనమాలు దిద్దింది. ఎంజీఆర్ తరువాత అన్నా డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత ఐదు సార్లు తమిళనాడుకు తిరుగులేని ముఖ్యమంత్రిగా కొనసాగారు. జయలలిత 2016 డిసెంబర్ 5న అనారోగ్యంతో మృతిచెందారు. జయలలిత జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించబోతున్నారు దర్శకురాలు ప్రియదర్శిని.

ది ఐరన్ లేడీ పేరుతో దర్శకురాలు ప్రియదర్శిని జయలలిత బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ప్రియదర్శినికి దర్శకురాలిగా ఇది డెబ్యూ మూవీ.జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తుంది. నేడు జయలలిత పుట్టిన రోజు సందర్భంగా ప్రియదర్శిని ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఫస్ట్ లుక్‌లో నిత్యామీనన్ జయలలితలాగే కట్టు, బొట్టు, చిరునవ్వుతో కనిపిస్తోంది.ఈ చిత్రంలో ఎలాంటి విషయాలను చూపిస్తుందో అని తమిళనాడు మొత్తం ఎదురుచూస్తుంది.