నా పెళ్లి ఖచ్చితంగా అక్కడే జరుగుతుంది : జాన్వి

295

అతిలోక సుందరి అనగానే శ్రీదేవి పేరు గుర్తుకు వస్తుంది.ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపేసిన నటి ఆమె.ఆమె చనిపోయిన ఆమె నటించిన సినిమాలు మన మదిలో ఎప్పుడు ఉంటాయి. అయితే శ్రీదేవి వారసురాలిగా ఆమె పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ఇటీవలే దఢక్ చిత్రంలో నటించి హిట్ కొట్టింది.అమ్మడుకు ఇప్పుడు మంచి అవకాశాలే వస్తున్నాయి.

Image result for jhanvi kapoor

ఈ విషయాలన్నీ పక్కనే పెడితే ఇప్పుడు ఈ అమ్మడు తన పెళ్లి గురించి మాట్లాడుతుంది.తాను ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నానన్న విషయం తెలీదు కానీ చేసుకుంటే మాత్రం ఇటలీలోని ఫ్లోరెన్స్‌ ప్రాంతంలోనే చేసుకుంటానని అంటోంది. గతంలో తన తల్లిదండ్రులతో కలిసి విహారయాత్ర నిమిత్తం ఫ్లోరెన్స్‌కు వెళ్లినప్పుడు ఆ ప్రాంతపు అందాలను చూసి మతిపోయిందని తెలిపింది.

Image result for jhanvi kapoor

అందుకే అక్కడే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఇక జాన్వి వ్యక్తిగత విషయానికొస్తే.. ఆమె శిఖర్‌ పహారియా అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. శిఖర్‌ కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు. గతంలో జాన్వి, శిఖర్‌ వ్యక్తిగత ఫొటోలు కూడా బయటికి వచ్చాయి.