తెలుగులో ఆ దర్శకుడు అయితేనే సినిమా చేస్తా అంటున్న జాన్వీ కపూర్..పెద్ద టార్గెటే పెట్టుకుందిగా..

300

అతిలోక సుందరి అనగానే శ్రీదేవి పేరు గుర్తుకు వస్తుంది.ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపేసిన నటి ఆమె.ఆమె చనిపోయిన ఆమె నటించిన సినిమాలు మన మదిలో ఎప్పుడు ఉంటాయి. అయితే శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ఇటీవలే దఢక్ చిత్రంలో నటించి హిట్ కొట్టింది.

Related image

 

ఆమె త్వరలో ఒక తెలుగు సినిమా చేస్తుందన్న వార్తలు వచ్చాయి.విజయ్ దేవరకొండ తదుపరి చిత్రంలో జాహ్నవి నటిస్తుందంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇదే విషయంపై జర్నలిస్ట్ నేరుగా జాహ్నవిని అడిగితే దక్షిణాది చిత్రాల్లో నటించే ఆలోచన లేదని తేల్చి చెప్పేసిందట. దక్షిణాది తార శ్రీదేవి కుమార్తెవై ఇలా సౌత్ ఇండస్ట్రీ చిత్రాల్లో నటించనని చెప్పడమేమిటని అడిగితే ఇప్పటికి లేదు కానీ మంచి కథ దొరికితే నటిస్తానేమో.

Image result for jhanvi kapoor

బాహుబలి లాంటి కథ వస్తే తప్పకుండా ఆలోచిస్తానని అంటోందట.దర్శకుడు రాజమౌళి ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా నటిస్తా అంటుంది.మరి జక్కన్న ఆమెకు ఆఫర్ ఇచ్చేది ఎప్పుడో ఆమె నటించేది ఎప్పుడో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.