తండ్రితో క‌లిసి జాన్వీ కొత్త ప్రాజెక్ట్

392

శ్రీదేవి, బోనీకపూర్‌ల ముద్దుల తనయ జాన్వీ కపూర్ బాలీవుడ్ లో త‌న తొలి సినిమాతో అరంగేట్రం చేసి స‌క్సెస్ అయింది..ఆమె నటించిన ధడక్ మంచి వసూళ్లతో ముందుకెళుతోంది.. ఇప్ప‌టికే బాలీవుడ్ లో ఈ సినిమా విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకుంది.. ఇక ఆమె న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయ్యారు.. తొలి చిత్రం జాన్వీకి మంచి స‌క్సెస్ ఇచ్చింది అనే చెప్పాలి.

Image result for janhvi kapoor

ఇక శ్రీదేవి కుమార్తె జాన్వీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటా అని ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు…ఆమె తండ్రి బోనీకపూర్‌ తన సొంత నిర్మాణ సంస్థలోనే జాన్వీతో సినిమా చేయాలనుకుంటున్నట్టు, బాలీవుడ్ లో వార్త‌లు వ‌స్తున్నాయి.. అస‌లు జాన్వీ తొలి చిత్రం తెరంగేట్రం కూడా సొంత నిర్మాణ సంస్ద‌లో ఇవ్వాలి అని అనుకున్నారు.. కాని ఆ స‌మ‌యంలో శ్రీదేవి వ‌ద్దు అని చెప్ప‌డంతో బ‌య‌ట సంస్ద‌కే ఈ బాధ్య‌త అప్ప‌గించారు.

Related image

ధడక్ చిత్రాన్ని మించిన ఓ మంచి కథతో ఈ చిత్రం ఉండాలని బోనీక‌పూర్ భావిస్తున్నారట. ధడక్ లో కంటే మరింత వైవిధ్యమైన పాత్ర కోసం బోనీ కథను సిద్ధం చేయిస్తున్నారు. శ్రీదేవి నటించిన మిస్టర్‌ ఇండియా ను మించేలా ఈ సినిమా చేయాలి అని ఆయ‌న చూస్తున్నార‌ట.. ఇక కపూర్ ఫ్యామిలీలో స‌భ్యుల సినిమా అంటే ఆయ‌న మంచినీరులా డ‌బ్బులు ఖ‌ర్చుచేస్తారు అనేది తెలిసిందే. మ‌రి చూడాలి ఎటువంటి క్రేజీ ప్రాజెక్టుతో ఆయ‌న ముందుకు వ‌స్తారో.