జై ల‌వ‌కుశ‌కు అరుదైన ఘ‌న‌త

385

ఎన్టీఆర్ సినిమాల్లో ఓ అరుదైన చిత్రంగా జైల‌వ‌కుశ సినిమాని చెప్ప‌వ‌చ్చు.. ఎన్టీఆర్ న‌ట‌న‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా చెప్పే ఓ సినిమా ఇది.. ఇక బాబీ ద‌ర్శ‌క‌త్వంలో అన్ని ప్ల‌స్ లు ఉన్న సినిమాగా మార్క్ సాధించారు ద‌ర్శ‌కుడు బాబి.. ఇక ఈ బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్ సినిమా ఎన్టీఆర్ కు కెరియ‌ర్ లో ఎంత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందో తెలిసిందే.

Image result for జై ల‌వ‌కుశ‌
ఇక అన్న క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌గా ఈ సినిమాతో మంచి స‌క్సెస్ అందుకున్నాడు.. ఈ సినిమాలో డైలాగ్స్ ఎంతో ప‌వ‌ర్ ఫుల్లో ఆ డైలాగ్ చెప్పిన ఎన్టీఆర్ వాటికి మ‌రింత వ‌న్నె తీసుకువ‌చ్చారు…సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది…ఆ రావణుణ్ని చంపాలంటే సముద్రం దాటాల.. ఈ రావణుణ్ని సంపాలంటే సముద్రమంత ధైర్యం ఉండాల ఇలాంటి డైలాగులు ఇప్ప‌టికీ ఎన్టీఆర్ అభిమానుల నోటి నుంచి వినిపిస్తాయి.

Image result for జై ల‌వ‌కుశ‌

 

ఇక సీనీ విమ‌ర్శ‌కుల నుంచి కూడా ఈ సినిమా పై ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.. తాజాగా ఈ సినిమాకు ఓ అరుదైన ఘ‌న‌త వ‌చ్చింది…జై లవకుశ చిత్రం దక్షిణ కొరియాలోని బుచాన్‌ ఇంటర్నేషనల్‌ ఫెంటాస్టిక్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (బి.ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఎఫ్‌)లో ఉత్తమ ఆసియా చిత్రాల విభాగంలో ప్రదర్శనకి ఎంపికైంది. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటి అంటే? అక్కడ ప్రదర్శితమవుతున్న తొలి తెలుగు సినిమా జై లవకుశ కావడం విశేషం… దీంతో చిత్ర యూనిట్ అలాగే ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.