YSR బయోపిక్ లో రాజారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు

388
తెలుగులో వరుసగా బయోపిక్ లు రెడీ అవుతున్నాయి.ఈ మధ్యే వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటి ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మనకు తెలుసు.ఇప్పుడు ఎన్టీఆర్ మరియు వైఎస్ ఆర్ బయోపిక్ తెరకెక్కుతుంది.యాత్ర అనే టైటిల్వై పెట్టారు.ఎస్ఆర్ బయోపిక్ ను  ‘ఆనందో బ్రహ్మ’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న మహి.వి.రాఘవ్ తెరకేక్కిస్తున్నాడు.
ఇక మలయాళ లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ఇందులో వైఎస్ పాత్ర చేస్తున్నాడన్నాక జనాల్లో ఒక్కసారిగా ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక ఈ చిత్రంలో ఇతర పాత్రలకు వినిపిస్తున్న పేర్లు చూస్తే క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది.‘యాత్ర’లో రావు రమేష్.. పోసాని కృష్ణమురళి.. అనసూయ లాంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఒక క్రేజీ ఆర్టిస్టును ఈ సినిమా కోసం తీసుకున్నారు. ఆయన మరెవరో కాదు.. జగపతిబాబు.
వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడట. ఫ్యాక్షనిస్టుగా గుర్తింపున్న రాజా రెడ్డి గురించి పులివెందులలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆయనలో మంచి-చెడు కోణాలు రెండూ ఉన్నాయి. ఐతే తన కంటే వయసులో పెద్ద అయిన మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటిస్తుంటే.. జగపతిబాబు రాజారెడ్డి క్యారెక్టర్లో కనిపించబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఆ పాత్రలో జగపతి ఎలా మెప్పిస్తాడో చూడాలి.